జమున ఇంటికి వెళ్లాలంటే అందరు భయపడేవారు .. కారణం ఏంటో తెలుసా ?

మరొక తార నింగికెగిసింది .నిన్నటి తరం ఇక ముగిసిపోయింది.

సావిత్రి లాంటి మహానటి తర్వాత అంతటి స్థాయి ఉన్న నటిగా జమున పేరు తెచ్చుకుంది.86 ఏళ్ల ప్రాయంలో కూడా ఎంతో చక్కగా, హుషారుగా ఉండే ఆమె నేడు తన హైదరాబాద్ నివాసంలో కన్నుమూసింది.కన్నడ మాతృభాష అయినప్పటికీ తెలుగు ఇంటికి కోడలుగా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది.

ఆమె మన వెండి తెర సత్యభామ . ఆమె లేని సినిమాని ఊహించలేము.నాటి హీరోలు కృష్ణ, ఎన్టీఆర్, అక్కినేని వంటి వారికి ఆమె సరిసమానం.

సీనియర్స్ అంతా కూడా ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నారు.అదే దోవలో నేడు జమున కూడా కన్నుమూయడం నిజంగా తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు వంటిదే.

ఇక జమున గురించి ప్రస్తుతం అందరూ రకరకాల స్టోరీలు, ఆర్టికల్స్, వీడియోలు చెప్తున్నారు.ఆమె పుట్టిన నేపథ్యం, నటించిన సినిమా ఇండస్ట్రీ లు,రాజకీయ ప్రయాణం, తోటి నటులతో ఆమె స్నేహం అలాగే వివాదాలు ఇలా ఏ ఒక్కటి వదలట్లేదు.

Advertisement

ఎవరెన్ని చెప్పినా ఆమె తిరిగి రారు కానీ ఆమె గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఆమె అభిమానుల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.ఇక జమునకు మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం అని చాలా మందికి తెలుసు.ఆమె ఎక్కువగా తన ఇంట్లో కుక్కలను పెంచుతూ ఉంటుంది.

జమున బంజారా హిల్స్ లో నివాసం ఉండేవారు.ఎవరైనా జమున ఇంటికి వెళ్లాలంటే చాలా భయపడేవారట.

ఇప్పటికీ ఆమె ఇంట నిండా కుక్కలే ఉంటాయి.

జమున చనిపోయే వరకు కూడా మూగజీవాలను పెంచుతూనే ఉన్నారు.బయటికి ఆమె ఎంతో గంభీరంగా కనిపించినా ఎంతో సున్నిత మనస్స్కురాలు.అలాగే ఆమె ఇంటికి వెళ్లి జమునను కలవాలంటే కుక్కలు కరుస్తాయేమో అని భయం ఉండేది కానీ వెళ్లిన తర్వాత అవి ఎంతో స్నేహంగా ఉండేవట.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక ఎన్నో కుక్కలకు తను పురుడు కూడా పోసానని సరదాగా ఆమె ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.జమునకు కన్నీటి నివాళులు అర్పించడం తప్ప మనం కూడా ఏమీ చేయలేము.

Advertisement

వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

తాజా వార్తలు