కనుమ రోజున పొలిమేర ఎందుకు దాటకూడదు..?

సంక్రాంతి అంటే ఆనందాల పండుగ.ఎందరినో ఆకర్షించే పండుగ సంక్రాంతి అని చెప్పవచ్చు.

సంక్రాంతి పండుగ రోజుల్లో హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి కనిపిస్తాయి.ఇక భోగి మకర సంక్రాంతి కనుమ( kanuma ) అంటూ మూడు రోజులపాటు ఆనందంగా ఈ పెద్ద పండుగను జరుపుకుంటారు.

ఇక ఆదివరాహా రూపంలో శ్రీ మహావిష్ణువు భూమినీ మకర సంక్రాంతి రోజునే ఉద్ధరించాడని పురాణ కథనం కూడా చెబుతోంది.అయితే ఈ పండుగలో చివరి రోజు కనుమ.

ఈరోజున పెద్దవాళ్లు తర్పణాలు ఇవ్వడం, దేవతలకు పొట్టేళ్లు, కోళ్లు బలి ఇవ్వడం, వారికి మొక్కులు తీర్చుకుంటూ ఉండటం చేస్తారు.ఈ రోజున శరీరానికి చలవనిచ్చే మినుములతో తయారుచేసిన వంటకాలు కూడా తింటారు.

Why Not Cross The Border On Kanuma Day , Kanuma Day, Cattle, Pushya, In Krishna
Advertisement
Why Not Cross The Border On Kanuma Day , Kanuma Day, Cattle, Pushya, In Krishna

అలాగే పశువులను( cattle ) కూడా తమలో ఒకరిగా భావించి వాటికి ఇష్టమైన ఆహారాన్ని కూడా వండి పెడతారు.ఇది మాత్రమే కాకుండా కనుమ రోజున ఎవరు కూడా పొలిమేర దాటకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.ఎందుకంటే కనుమ రోజున కనీసం కాకి కూడా కదలదని చెబుతారు.

కాబట్టి కనుమ రోజున ఎవ్వరు కూడా ప్రయాణాలు చేయకూడదని, అలా చేయడం వలన అశుభం కలుగుతుందని పెద్దవారు నమ్ముతారు.అయితే కనుమ రోజున పొలిమేర దాటితే లేదా ప్రయాణిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పండగ సమయంలో చాలామంది పల్లెల్లో పొలిమేర దేవతలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు.ఆ సమయంలో దేవతలు ఆ ఊరి చుట్టూ రక్షణ విధిస్తారని నమ్ముతారు.

Why Not Cross The Border On Kanuma Day , Kanuma Day, Cattle, Pushya, In Krishna

కాబట్టి రక్షణ కాపాడడానికి ఆ ఊరులోని వారు ఎక్కడికి కూడా ప్రయాణించకూడదు.ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని వ్యతిరేకరించి ప్రయాణాలు చేస్తే వారికి కచ్చితంగా చెడు పీడలు కలుగుతాయని చెబుతారు.అంతేకాకుండా పురాణాల ప్రకారం పుష్య మాసంలో, కృష్ణపక్షంలో( Pushya, in Krishna Paksha ) వచ్చే కనుమ పండుగ రోజున శని సంబంధిత నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

కాబట్టి ఆ రోజున దేవతలందరూ మన ఇంటికి వస్తారని కాబట్టి కనుమ,ముక్కనుమ రోజున ప్రయాణం చేయకూడదని పెద్దలు అలాగే పండితులు సూచిస్తున్నారు.కాబట్టి కనుమ రోజున ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది.

Advertisement

తాజా వార్తలు