Mahesh babu : కృష్ణ గారు మహేష్ బాబు, నమ్రతల లవ్ కి ఎందుకు ‘నో’ చెప్పారు ?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ చార్మింగ్ యాక్టర్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు.

( Mahesh babu ) అమ్మయ్యిల్లో ఈయనకు ఉన్న క్రేజ్ అంత ఎంత కాదు.

సుమారు నాలుగు దశాబ్దాల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్.ఇప్పటికి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ( Krishna ) గారి వారసుడిగా పరిచయమైనప్పటికీ, అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు.ఈ ఏడాది ఆగష్టు 9న మహేష్ తన 48వ ఏట అడుగుపెడతాడు.

ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని పర్సనల్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.మహేష్ నమ్రతలది ప్రేమ వివాహం అని మనందరికీ తెలిసినదే.

Advertisement

కానీ వీరి వివాహానికి కృష్ణ గారు మొదట అంగీకరించలేదట.కారణం ఏమిటంటే.

ఘట్టమనేని మహేష్ బాబు 1975 వ సంవత్సరం ఆగష్టు 9న జన్మించారు.మహేష్ నాలుగోవ ఏటా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో "నీడ" అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా మొదటి సారి తెరపై కనిపించారు.తరువాత తన తండ్రితో కలిసి అనేక చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు.

మంచి ప్రశంసలు, అవార్డులు కూడా అందుకున్నారు.తరువాత కొన్నాళ్లపాటు చదువు కారణంగా సినిమాలకు దూరమైన మహేష్ తిరిగి కే రాఘవేందర్రావు దర్శకత్వంలో "రాజకుమారుడు"( Raja Kumarudu ) అనే చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ సినిమా మంచి విజయం సాధించింది.మహేష్ అందరికి సుపరిచితుడయ్యాడు.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

తరువాత వంశి, యువరాజు చిత్రాలలో నటించాడు.వంశి చిత్రంలో హీరోయిన్ గా మహేష్ సరసన నమ్రత నటించింది.

Advertisement

ఈ చిత్రంతో వీళ్ళ ప్రయాణం మొదలయింది.

ఐదేళ్లపాటు ప్రేమించుకున్న తరువాత వీళ్ళు తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు.ఈ విషయం విన్న కృష్ణ గారు వీళ్ళ ప్రేమను అంగీకరించలేదట.దీనికి కారణం కృష్ణ గారు మహేష్ కు ఒక తెలుగు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకోవడమే.

కానీ మహేష్ తల్లి కృష్ణ గారిని ఒప్పించారట.వీరి లవ్ స్టోరీ మొదలైనప్పటినుంచి మహేష్ అక్క మంజుల వీరికి మంచి సపోర్ట్ ఇచ్చారట.వీరి పెళ్లి జరగడంలో ఆమె కీలక పాత్ర పోషించిందట.

చివరికి వీరి వివాహం 2005 ఫిబ్రవరి 10న జరిగింది.

" autoplay>

తాజా వార్తలు