Krishna Vanisri : మాట్లాడుకోకుండా ఏకంగా 13 సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్స్ వీరే!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో కలిసి నటించిన వారంతా కలిసి ఉంటారు అనే రూల్ ఏం లేదు.

ఒక్కోసారి తెరపై ఎంతో క్లోజ్ గా కనిపించేవారు తెర వెనుక దూరం దూరంగా ఉంటారు.

ఇక సినిమాలో డ్యూయెట్స్, సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు జరుగుతాయి కాబట్టి మీరు బయట కూడా అంతే క్లోజ్ గా ఉంటారని కొంతమంది బ్రమ పడుతూ ఉంటారు.ఇక కొంతమంది ఇప్పుడైతే సినిమాల్లో క్లోజ్ గా ఉంటూ బయట కూడా కలిసి తిరుగుతున్నారు కాబట్టి అది నిజం అనుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇప్పుడు మీడియా పరిధి చాలా పెరిగిపోయింది కాబట్టి చీమ చీటుక్కుమన్నా కూడా అందరికీ తెలిసిపోతుంది.కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు.

ఏం జరిగినా ఎవరో ఒకరు మీడియాకి చెప్పేంత వరకు కూడా విషయాలు బయటకు తెలిసేవి కావు.

Why Krishna And Vanisri Are Not Close
Advertisement
Why Krishna And Vanisri Are Not Close-Krishna Vanisri : మాట్లాడ�

అందుకు ఉదాహరణ వాణిశ్రీ( Vanisri ) మరియు కృష్ణ.( Krishna ) వీరిద్దరూ కలిసి అనేక సినిమాల్లో నటించారు.దాదాపు 13 సినిమాల్లో వీరు కలిసి నటించిన కూడా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదట.

మరి ఇలా ఉండడానికి వీరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే అది నిజం కాదు.వీరిద్దరూ కేవలం నటనను ప్రొఫెషనల్ గా తీసుకొని నటించడం వరకు మాత్రమే చేసేవారు.

సీన్ అయిపోయిందంటే ఎవరి ప్లేస్ కి వెళ్లి వారు వెళ్ళిపోయి కూర్చునేవారు.అందుకు స్పెషల్ గా కారణాలు ఏమీ లేవు.

స్వతహాగా కృష్ణ చాలా తక్కువగా మాట్లాడతారు.ఒకసారి క్లోజ్ అయితే తప్ప ఆయన ఎవరితో సన్నిహితంగా మాట్లాడలేరు.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

అలాగే వాణిశ్రీ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని దూరంగానే ఉండేది.గొడవలు లేకపోయినా కూడా మాట్లాడుకోకుండా ఉన్న జంట టాలీవుడ్ లో( Tollywood ) వీరు మాత్రమే.

Why Krishna And Vanisri Are Not Close
Advertisement

తనతో కృష్ణ గారు ఎందుకు మాట్లాడరు అని మొదట్లో చాలా ఆలోచించేవారట వాణిశ్రీ.ఆ తర్వాత అసలు ఆలోచించడం వల్ల అర్థం లేదని భావించి మానేశారట.అది కేవలం కృష్ణ తత్వం మాత్రమే అని సరిపుచ్చుకున్నారట.

కృష్ణ వాణిశ్రీ తో మొదటిసారి మరియు చివరిసారి మాట్లాడింది ఒకే ఒక్కసారి.అది కూడా వెంకటేష్ కి( Venkatesh ) తల్లి పాత్ర చేయమని అబ్బాయి గారు సినిమా( Abbaigaru Movie ) కోసం అడిగారట.

కానీ ఆ సినిమా క్లైమాక్స్ లో కొడుకుకి విషం పెట్టి చంపే తల్లి పాత్ర చేయడానికి ఆమె మనసు ఒప్పుకోకపోవడంతో ఆమె చేయను అని చెప్పారట.అదే మొదటిసారి మరియు చివరిసారి వారు మాట్లాడుకున్నారట.

తాజా వార్తలు