శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఆరోజే ఎందుకు చేస్తారో తెలుసా..?

యావత్ దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క క్షణం ఏదైనా ఉందంటే అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట( Lord Ram Statue ) అని చెప్పవచ్చు.

అయితే ఎన్నో ఏళ్లుగా ఈ సమయం కోసం చాలా మంది భక్తులు వేచి ఉన్నారు.

అయితే అందరి కలలు నెరవేరుస్తూ జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో( Ayodhya Ram Mandir ) రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది.అయితే జనవరి 22వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? ఆ రోజుకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అన్న దానిపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ( Brahmasri Chilakamarthi Prabhakara Chakravarthi Sharma ) తెలిపారు.జనవరి 22వ తేదీన అయోధ్యలో అఖిజిత్ తో కూడి ఉన్నటువంటి మేషలగ్నంలో 12 నుండి 12:30 సమయంలో ఉత్తరాయన కాలం, అలాగే విశేషించి పుష్య మాస శుక్ల పక్ష ద్వాదశి రోజు సోమవారం మృగశిర నక్షత్రంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా శుభం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Why January 22nd Selected Ayodhya Ram Mandir Pran Pratishtha Details, January 22

అయితే ఈ ముహూర్త బలాల ప్రకారం లగ్నంలో గురుడు, ద్వితీయంలో చంద్రుడు, ఉచ్చ క్షేత్రంలో ఉండటం, లాభంలో శని స్వక్షేత్రంలో ఉండటం, అలాగే భాగ్యములో బుధ, శుక్ర, కుజులు అనుకూలంగా ఉండడం వలన ఇది చాలా దివ్యమైన ముహూర్తంగా చెప్పడం జరిగింది.ఈ ముహూర్తంలో ప్రభావంచేత కొన్ని తరాలపాటు ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లుతోందని, ఈ లగ్నంలో గురుని ప్రభావం వలన భక్తులు( Devotees ) కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పంచాంగ కర్త తెలిపారు.

Why January 22nd Selected Ayodhya Ram Mandir Pran Pratishtha Details, January 22

అయితే అయోధ్యలో( Ayodhya ) శ్రీరాముని ఆలయ ప్రతిష్ట జరగడం, అది చూసేటువంటి భాగ్యం కలగడం ప్రస్తుత తరంలో ఉన్నవారికి కలిగిన గొప్ప అదృష్టం అని చెప్పవచ్చు.ఇక ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని వీక్షించిన వారి జన్మ చతురతార్థం అవుతుందని చిలుకమర్తి చెప్పుకొచ్చారు.అలాగే ఈ తరుణాన్ని అందరూ కూడా వీక్షించాలని కోరారు.

Advertisement
Why January 22nd Selected Ayodhya Ram Mandir Pran Pratishtha Details, January 22

అయితే భక్తుల కోసం అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్లో ఉండి మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు.

ఉప్పు నీరుతో ఎన్ని అద్భుత ప్ర‌యోజ‌నాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు