రక్త చరిత్రలో ఆ పాత్ర జగపతి చేయాల్సిందట.. కానీ చివరికి..?

ప్రముఖ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ,( Ram Gopal Varma ) టాలెంటెడ్ యాక్టర్ జగపతిబాబు( Jagapathi Babu ) కలిసి గాయం (1993)( Gaayam ) సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత జగ్గు భాయ్ ఆర్జీవీ డైరెక్టోరియల్ "మనీ మనీ (1994)"లో ఒక క్యామియో రోల్ చేశాడు.

హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ రక్ష (2008), క్రైమ్ మూవీ గాయం 2 కోసం కూడా వీరిద్దరూ కలిసి పనిచేశారు.రామ్ గోపాల్ వర్మ "అటాక్ (2016)" సినిమాలో కూడా జగపతిబాబు ఒక కీ రోల్‌ ప్లే చేశాడు.

ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో కాలి అనే పాత్ర చేసి మెప్పించాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో మరొక బ్లాక్ బస్టర్ సినిమా రావాల్సి ఉంది కానీ అది మిస్ అయింది.

ఆ మూవీ మరో ఏదో కాదు హాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసిన రక్త చరిత్ర.

Why Jagapathi Babu Replaced In Raktha Charitha Details, Jagapathi Babu, Director
Advertisement
Why Jagapathi Babu Replaced In Raktha Charitha Details, Jagapathi Babu, Director

పరిటాల రవీంద్ర జీవితం ఆధారంగా రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ "రక్త చరిత్ర"( Raktha Charitra ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.దీనికి ప్రశాంత్ పాండే స్టోరీ రాశాడు.తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు.

ఇందులో తెలుగు యాక్టర్ల కంటే ఇతర భాషల నటీనటులే ఎక్కువగా ఉన్నారు.ఈ సినిమా కథ, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, డైలాగులు, నిజ జీవితానికి దగ్గరగా ఉన్న విధానం, అన్నీ ప్రేక్షకులు, విమర్శకులకు తెగ నచ్చాయి.

పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్( Vivek Oberoi ) చూపించిన యాక్టింగ్ ఆయన కెరీర్ లోనే బెస్ట్ అని చాలామంది క్రిటిక్స్ కామెంట్లు చేశారు.పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్ చూపించిన అద్భుతమైన నటనకు సర్వత్రా ప్రశంసలు అందాయి.

కొన్ని అవార్డ్స్‌కి బెస్ట్ యాక్టర్‌గా వివేక్ ఒబెరాయ్ నామినేట్ కూడా అయ్యాడు.

Why Jagapathi Babu Replaced In Raktha Charitha Details, Jagapathi Babu, Director
వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

కానీ ఈ పరిటాల రవి పాత్రను ముందుగా జగపతి బాబుకు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ అనుకున్నాడట.అయితే ఫ్రెష్ ఫేసెస్ తీసుకొస్తేనే ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఆయన జగ్గు భాయ్ ని పక్కన పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.ఒకవేళ ఈ పాత్రలో జగపతిబాబు నటించినట్లయితే ఆ సినిమా వేరే రేంజ్ లో ఉండేది.

Advertisement

కానీ వివేక్ ఒబెరాయ్ కూడా చాలా మంచి ఛాయిస్.ఆ పాత్రను ఇతను తప్ప మరొకరు చేయలేరేమో అని కూడా అనిపిస్తుంది.

ఏదేమైనా క్యాస్టింగ్ విషయంలో రామ్‌ గోపాల్ వర్మ చాలా పక్కాగా ఉంటాడు.ఏ సినిమా క్యాస్టింగ్ విషయంలో ఈ డైరెక్టర్ తప్పు చేయలేదని చెప్పవచ్చు.

ఇకపోతే రక్త చరిత్ర కంటే ముందు రామ్ గోపాల్ వర్మ, వివేక్ ఒబెరాయ్ కలిసి "కంపెనీ", "రోడ్" వంటి రెండు సినిమాలు చేయగా అవి కూడా బిగ్గెస్ట్ హిట్స్‌ అయ్యాయి.అయితే "రక్త చరిత్ర" మరింత సక్సెస్ సాధించింది.

ఈ సినిమాలో చూపించిన హింస, రక్తం ప్రేక్షకులను కలచివేస్తాయి.

తాజా వార్తలు