ప్రభాస్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో సినిమా ఎందుకు రాలేదంటే..?

ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకం గా చెప్పాలి అంటే సినిమాలు ఆయన్ని స్టార్ ని చేశాయి కానీ ఆయన నిజంగా ఒక మంచి మనిషి అనే చెప్పాలి ఎందుకంటే ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఎవరు ఉండరు.

అయితే ప్రభాస్ కి ఎలాంటి చెత్త రూమర్ లేకుండా ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

అయితే ఈయనపై ప్రేమ వార్తలు వినిపించడం కామనే కానీ ఇప్పటివరకు హీరోయిన్ల విషయంలో కానీ లేదా మిగతా ఏ విషయంలోనైనా చెత్త పని చేసినట్లు ఇప్పటివరకు ఎక్కడా కూడా బయటపడలేదు.అలాంటి ఈ హీరో గురించి తాజాగా ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే.ఇప్పటి వరకు ఎలాంటి తప్పు పని చేయని ప్రభాస్ ఆ హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద తప్పు చేశారు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

అదేంటంటే ప్రభాస్ ఓ స్టార్ హీరోయిన్ ని దారుణంగా అవమానించారట.ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ).అవును మీరు వినేది నిజమే.రకుల్ ప్రీత్ సింగ్ ని నిజంగానే ప్రభాస్ అవమానించారట.

Why Is There No Movie In Prabhas Rakul Preet Singh Combo, Rakul Preeth Singh, P
Advertisement
Why Is There No Movie In Prabhas Rakul Preet Singh Combo, Rakul Preeth Singh, P

ఎలా అంటే ప్రభాస్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో రావాల్సిన డార్లింగ్ సినిమా( Darling movie ) కాజల్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చింది.అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్న మూవీ యూనిట్ రెండు మూడు రోజులు షూటింగ్ తీసి ఆ తర్వాత ఆ సన్నివేశాలను చూసిన ప్రభాస్ ఈ హీరోయిన్ అంతలా బాగాలేదు.ఎందుకంటే నేను హైటే ఆ హీరోయిన్ కూడా హైటే.

హైట్ ఉన్న పర్లేదు కానీ సన్నగా అలాగే మొహం కూడా అబ్బాయిలా కనిపిస్తుంది అని చెప్పాడట.

Why Is There No Movie In Prabhas Rakul Preet Singh Combo, Rakul Preeth Singh, P

ఇక ఈ సినిమాలో మనం అనుకున్న పాత్రకి రకుల్ అంతగా సెట్ అవ్వదు కాజల్ ( Kajal ) అయితే బాగుంటుంది అంటూ చిత్ర యూనిట్ కి ప్రభాసే స్వయంగా సలహా ఇచ్చారట.దాంతో చిత్ర యూనిట్ కూడా ప్రభాస్ చెప్పిన మాటలు విని రకుల్ ప్రీత్ సింగ్ ని తీసేసి కాజల్ ని ఆ సినిమాలో తీసుకున్నారు.అయితే ఈ విషయం తెలిసాక రకుల్ ప్రీత్ సింగ్ తన సన్నిహితుల వద్ద ప్రభాస్ గురించి చెప్పుకొని చాలా బాధపడిందట.

అందుకే అప్పటినుండి ఇప్పటివరకు ప్రభాస్ తో సినిమాలో అవకాశం వచ్చినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటించలేదట.ఇక ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది .అంతే తప్ప తెలుగు లో ఒక్క మువింకుడ చేయడం లేదు.ఇక ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు