Kishan Reddy : నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకు..?: కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) నివాసంలో ఈడీ మరియు ఐటీ అధికారుల దాడులపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) స్పందించారు.

నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఈడీ అధికారుల విచారణకు కవిత సహకరించాలని సూచించారు.ఇన్నాళ్లు ఈడీ విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకున్నారని ఆరోపించారు.

కవిత సహకరించకపోవడంతోనే ఈడీ అధికారులే ఆమె నివాసానికి వచ్చారని తెలిపారు.కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి( BJP ) లేదన్నారు.

విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని స్పష్టం చేశారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు