ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో హీరో యష్

ఒకసారి హిట్ దక్కితే సరిపోదు.ఆ హిట్ నిలబెట్టుకోవాలి.

స్టార్ డం నీ కాపాడుకోవాలి.

ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకూడదు.

ఇలా చాలా రకాల గోల్స్ తో ఒక హీరో పని చేయాల్సి ఉంటుంది.మరి ఇన్ని చేసేటప్పుడు ఏదైనా కాస్త అటు ఇటు అయ్యిందా ఇక అంతే సంగతులు.

మళ్ళీ తిరిగి తెచ్చుకోలేనేంత దూరం విజయాలు వెళ్లిపోతాయి.ఇప్పుడు ఇదే విషయం సరిగ్గా వర్తిస్తుంది కన్నడ స్టార్ హీరో యష్ కి.కే జి ఎఫ్ రెండు సినిమాలతో ప్రపంచ స్థాయిలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఆ స్టార్ధం ని కాపాడుకోవడానికి ఇప్పుడు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది.

Advertisement

ఓ గొప్ప సినిమా తీసిన తర్వాత దానికన్నా మించిన సినిమా రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు.అందుకే కాస్త గ్యాప్ తీసుకొని అయినా సరే జాగ్రత్తగా అడుగులు వేయాలనే యష్ డిసైడ్ అయ్యాడు.

ఇప్పటికే గీత మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమా అనౌన్స్ చేశాడు.ప్రశాంత్ నీల్ మరియు యష్ కాంబినేషన్ లోనే కేజిఎఫ్ కి మూడవ పార్ట్ రానుంది.దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది.

అలాగే ఇప్పుడు నితీష్ తివారి దర్శకత్వంలో నార్త్ లో రామాయణం( Ramayana ) తెరకెక్కబోతోంది.దీనికి కో ప్రొడ్యూసర్ గా కూడా మారిపోయాడు యష్.అంతే కాదు ఈ సినిమాలో కూడా మంచి రోల్ ఖచ్చితంగా పోషిస్తాడు అని అందరూ అనుకుంటున్నారు.కానీ ఏ రోల్ లో తాను నటించబోయే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు గొప్యంగానే ఉంచుతున్నారు.

మరి ఈ వివరాలను ఎప్పుడు వెల్లడిస్తారో తెలియదు కానీ నార్త్ రామాయణం విషయంలో మాత్రం యశ్ కి చాలా బాధ్యతలే ఉన్నాయి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఇక దీని తర్వాత ఆ పవన్ వాడియార్( Pawan Wadeyar ) దర్శకత్వంలో గూగ్లీకి సీక్వల్ గా గూగ్లీ 2 రానుంది.ఇక ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కేజిఎఫ్ 1 అలాగే 2 లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో నటించాడు యష్.ఇక టాక్సిక్ సినిమాలో కూడా గ్రే పాత్రలోనే కనిపించబోతున్నాడట.

Advertisement

దాంతో పాటు రామాయణంలో కూడా విలన్ పాత్రలో అంటే రావణుడి పాత్రలో నటించబోతున్నాడు అంటూ ఊహగానాలు వెలబడుతున్నాయి.ఇక కేజీఎఫ్ పార్ట్ 3 సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.కేజిఎఫ్ చిత్రాలన్నీ కూడా హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే.

ఇలా వరుస పెట్టి 5 సినిమాల్లో నెగటివ్ పాత్రలో నటించబోతున్నాడు హీరో యష్.తన ముందు హీరో అవ్వాలనే లక్ష్యం కన్నా సినిమాలు హిట్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకునే పని చేస్తున్నాడు.

తాజా వార్తలు