గడ్డం తీయడం ఇష్టం లేక బొంబాయి సినిమా వదులుకున్న హీరో ఎవరో తెలుసా ?

సృజనాత్మకతకు పెట్టింది పేరు దిగ్గజ దర్శకుడు మణిరత్నం.లెజెండరీ దర్శకులలో మణిరత్నం పేరు ఖచ్చితంగా ఉంటుంది.

నిజమైన సంఘటనను యదార్ధంగా తీసి ప్రేక్షకుల మనసు దోచుకోవడంలో మణిరత్నం కి పెట్టింది పేరు.ఇక ఇటీవల పొన్నియన్ సెల్వన్ అనే ఓ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాగా అది మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది.

కాసేపు ఈ విషయం పక్కన పెడితే మణిరత్నం తీసిన అద్భుతమైన సినిమాలలో బొంబాయి చిత్రం కూడా ఒకటి.అరవింద్ స్వామి మరియు మధుబాల హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం యదార్ధ సంఘటనగా ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ సినిమా ద్వారా తెలుగులో సైతం దర్శకుడుగా మణిరత్నం తొలిసారి పరిచయమయ్యారు.ఈ చిత్రంలోని పాటలు, సంగీతం అన్నీ కూడా ప్రేక్షకులను ఫిదా చేశాయి.

Advertisement

ఇక ఇప్పటికే దాదాపుగా 30 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ముంబైలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో తీశారు.అప్పట్లో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన మనందరికీ గుర్తుండే ఉంటుంది.ఆ సమయంలో జరిగిన దాడుల గురించి రెండు వర్గాల మధ్య గొడవ ల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనే ఇతివృత్తంగా ఈ చిత్రం విడుదలైంది.1993లో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది హృదయాలను కదిలించింది వాస్తవానికి బాబ్రీ మసీదు సంఘటన ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాడు మణిరత్నం.

అరవింద్ స్వామి పాత్రలో తొలుత హీరో విక్రమ్ చేత నటింప చేయాలని మణిరత్నం భావించారు.కానీ ఆ సమయంలో గడ్డం పెంచుకున్న విక్రమ్ ని చూసి మణిరత్నం గడ్డం, మీసం తీసేయాలని కోరారట అందుకు విక్రమ్ ఒప్పుకోకపోవడంతో మనసు నొచ్చుకున్నాడు మణిరత్నం.ఆ తర్వాత ఈ కథను అరవింద్ స్వామికి చెప్పి ఒప్పించాడట.

అలా బొంబాయి సినిమా అరవింద స్వామి హీరోగా విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది.ఈ సినిమా ఇప్పటికీ కూడా టీవీలో వస్తే ఎవ్వరూ చూడకుండా మిస్ చేయరు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు