గుమ్మాలకు మామిడి ఆకులు ఎందుకు కడతారు..? ప్రయోజనాలేంటి?

పండుగలు, శుభకార్యాలకు గుమ్మాలకు తోరణాలు కట్టడం తెలిసిందే. తోరణాలు కట్టకుండా శుభ కార్యాలు, పండగలు నిర్వహించం.

 మామిడి ఆకులే ఎక్కువగా కట్టడం తెలిసిందే. ఏదైనా పండగ జరిగినప్పుడు ప్రధాన గుమ్మానికే కాకుండా ఇంట్లో ఉన్న అన్ని దర్వాజాలకు మామిడి తోరణాలు కడతాం.

Why Everyone Put Mango Leafes At Threshold, Mango Leafs, Devotional , Threshold-

 ఇంటి ముందు గేటుకు కూడా మామిడి ఆకులు కట్టడం అలవాటే. మామిడి తోరణాలు కడితే ఇంటికి వచ్చే ఆ పండగ కళే వేరు.

మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాలు, పండగలకు వీటిని ఎక్కువగా వాడతారు.

Advertisement

 తోరణాలుగా మామిడి ఆకులను మాత్రమే ఉపయోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది.

 పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగోట్టేది మామిడి తోరణమే. మామిడి ఆకు కోరికలను తీరుస్తుందని అంటారు.

పర్వదినాల్లో, యజ్ఞ యాగాల్లో ధ్వజా రోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనిని అనుసరించే తోరణాలు కట్టే ఆచారం వచ్చింది.

మామిడి తోరణాలు కట్టడం అనేది ఆనవాయితీ వస్తున్నది మాత్రమే కాదు. ఒక సంస్కృతి కూడా.

అప్పులు తీర్చే గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

 గుమ్మాలకు మామిడి ఆకులు కట్టడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. మామిడి ఆకులు బ్యాక్టీరియా ను అరికడుతుందని అంటారు నిపుణులు.

Advertisement

 బయట నుండి వచ్చే హాని కారకమైన సూక్ష్మ జీవులను నిరోధిస్తుందని చెబుతారు. ఇలా గుమ్మాలకు ఆకులు కట్టడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయని అంటారు.

 అనారోగ్యం దరిచేరదని ప్రతీతి.మామిడి ఆకులను గుమ్మాలకు కట్టడమే కాకుండా ఇతర పూజా కార్యక్రమాల్లోనూ విరివిగా వాడతారు.

 దేవుళ్లకు ఏదైనా సమర్పించే సమయంలోనూ మామిడి ఆకులను వినియోగిస్తారు.

తాజా వార్తలు