నాస్టాల్జిక్ సీన్లతో ఆకట్టుకున్న "కమిటీ కుర్రోళ్లు".. ఎక్కడ దెబ్బ కొట్టింది?

మెగా డాటర్ నిహారిక కొణిదెల( Mega daughter Niharika Konidela ) ప్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి ఫుల్ లెన్త్ ఫీచర్‌ ఫిల్మ్ "కమిటీ కుర్రోళ్లు"( "Committee Kurrollu" movie ) తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ యూత్‌ఫుల్ కామెడీ డ్రామా మూవీ బాగానే మెప్పించింది కానీ ఇందులో చాలా మైనస్‌లు ఉన్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా ఒక జానర్ అంటూ చెప్పుకోలేని పరిస్థితి.ఎందుకంటే దర్శకుడు యదువంశీ( Director Yaduvamshi ) ఇందులో ప్రేమలు, ఊరి రాజకీయాలు, స్నేహాలు, రిజర్వేషన్లు, జాతర వంటి చాలా అంశాలను మిక్స్ చేశాడు.

ఈ సినిమా ఏదో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నట్లు ప్రారంభం అవుతుంది.తర్వాత మాత్రం అనవసరమైన అన్ని ఇంగ్రిడియంట్స్ మిక్స్ చేసినట్లుగా గందరగోళం జానర్‌గా మారుతుంది.

ఈ సన్నివేశాలను ఒక్కొక్కటిగా చూస్తే అన్నీ బాగానే ఉంటాయి.యదువంశీ మెరుగైన డైరెక్షనల్ స్కిల్స్ స్పష్టంగా కనిపిస్తాయి.

Advertisement
Why Committee Kurrallu Is Not Upto The Mark , Committee Kurrallu , Mega Daughter

ఈ మూవీ ఫస్టాఫ్‌లో ఫ్రెండ్‌షిప్, 90s విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో నాస్టాల్జిక్ సీన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి కానీ సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కథ ట్రాక్ తప్పింది.ఈ మూవీని ఎలా ముగించాలో డైరెక్టర్‌కి తెలియనట్లు ఉంది.

అందుకే దాన్ని అడ్డదిడ్డంగా తిప్పేస్తూ ప్రేక్షకులు ఆసక్తి కోల్పోయేలాగా చేశాడు.

Why Committee Kurrallu Is Not Upto The Mark , Committee Kurrallu , Mega Daughter

యదువంశీ మొదటి భాగంలో ప్రతి ఊరిలో కనిపించే కల్మషం లేని కులమతాలకు అతీతమైన స్నేహాలు, చాలా ముచ్చటైన లవ్ స్టోరీలు అన్ని చూపించి ఆకట్టుకోగలిగాడు.90s కిడ్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు.అప్పటి రోజులను గుర్తుతెచ్చుకోగలుగుతారు.

ఇందులో 11 మంది హీరోలు.వాళ్లే కమిటీ కుర్రోళ్లు.ఐదారుగురు హీరోయిన్లు ఉన్నారు.

Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built

వారందరినీ ఇంట్రడ్యూస్ చేయడానికే సినిమాలో చాలా టైమ్‌ వేస్ట్ గా పోయింది.రిజర్వేషన్ల వంటి సెన్సిటివ్ టాపిక్ వీళ్ళు తీసుకున్నారు కానీ దానికి ఒక ముగింపు లేకుండా సినిమా ముగించారు.

Advertisement

లవ్ స్టోరీలను కూడా మధ్యలోనే వదిలేశారు.

12 ఏళ్లకు ఓసారి జాతర పెట్టారు, ఓ కుర్రాడి మరణం ద్వారా ఆడియన్స్‌లో ఎమోషన్స్‌ క్రియేట్ చేయాలని భావించారు.అందరూ ఎవరిదారు వారు చూసుకొని వెళ్లడం, తర్వాత కలవడం చూపించారు కానీ ఆ కలిసే క్రమంలో కావాల్సిన ఎమోషన్ పండించలేకపోయారు.మొత్తం మీద ఈ సినిమా ఒక మాదిరిగా అనిపించింది.

అనిరుద్ బీజీఎమ్, సంగీతం, విలేజ్ సీన్లు ఈ మూవీకి బలాలు.మిగతాదంతా బోరింగ్ అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు