ఆషాడ మాసంలో శుభకార్యాలు ఎందుకు జరుపుకోరు.. సైంటిఫిక్ రీజన్ ఇదే..!

ఆషాడ మాసం ( Asadha masam )గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఎందుకంటే ఆషాడం మాసం నెలలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు.

ఈ మాసంలో తెలంగాణలో బోనాల సంబరాలు మొదలవుతాయి.ఆషాడశుద్ధ పాడ్యమి రోజు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు.

మహాభారతాన్ని రచించిన వ్యాసభవానుడిని ఆరాధించే రోజునే ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి( Guru Purnima ) అని అంటారు.ఈ ఆషాడ మాసం ఎన్నో పర్వదినాలను తీసుకొని వస్తుంది.

ఆషాడ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటి శుభకార్యాలు ఏవి చేయరు.అందుకే దీన్ని శూన్య మాసం అని కూడా అంటారు.

Advertisement

ఆషాడమాసంలో వివాహా శుభకార్యాలు ఏమి చేయరు.తెలంగాణలో అయితే గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకెళ్లి అమ్మవారికి అర్పించి బోనాలు సమర్పిస్తారు.

తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో కొత్త సంవత్సరం ప్రారంభమై ఫాల్గుణి మాసంలో ముగుస్తుంది.ఈ క్రమంలోనే నాలుగో నెలలో ఆషాడ మాసం వస్తుంది.

ఈ సమయంలో కొత్తగా పెళ్లయిన దంపతులు కలవకుండా జాగ్రత్త పడతారు.

నూతన వధువును పుట్టింటికి పంపుతారు.దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.ఆషాడం రాగానే చాలామంది మహిళలు గోరింటాకును గౌరీదేవికి ప్రతికగా భావిస్తారు.

రెండు శివలింగాలు ఉండే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం భరిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం చెబుతుంది.మరోవైపు ఈ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది.

Advertisement

ఈ నెల నుంచి వర్షాకాలం మొదలవుతుంది.అందుకే ఈ మాసంలో యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు, గాలి, నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఆషాడ మాసంలోనే హైదరాబాద్ లోని చరిత్రకా గోల్కొండలోని శ్రీ జగదాంబ దేవాలయం( Sri Jagdamba Mahakali Temple )లో తొలి పూజ చేసిన తర్వాతే రాష్ట్రం వ్యాప్తంగా బోనాల సందడి మొదలవుతుంది.ఈ తొలి బోనం సమర్పించే ఆనవాయితీ కుతుబ్షా కాలం నుంచి వస్తుందని పెద్దవారు చెబుతున్నారు.ఈ విధంగా ఆషాడం మాసంలో అనేక విశిష్టతలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు