అల్లు అర్జున్ ఫేస్ బాలేదంటూ సినిమా నుంచి తీసేశారు..?

సినిమాల్లో స్టార్ హీరోలుగా రాణిస్తున్న చాలామంది ఒకప్పుడు అవమానాలను ఫేస్ చేసిన వారే.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ హీరోగా అసలు పనికిరాడు అని ఒకప్పుడు దర్శకులు చాలా అవమానించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ని కూడా నీ మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అంటూ ఎగతాళి చేశారు.కానీ వాళ్లు ఢీలా పడుకోలేదు ముందుకు కొనసాగారు.

టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ఒకానొక సమయంలో ఇలాంటి కష్టాలను ఫేస్ చేశాడు.

కెరీర్ స్టార్టింగ్‌లో "నీ మొఖం బాగోలేదు, నిన్ను సినిమాలో పెట్టుకోలేం" అంటూ ఆయన్ను అవమానించారు కూడా.దాని గురించిన విషయాలు తెలుసుకుందాం.

Allu Arjun Removed From A Movie Details, Allu Arjun, Icon Star Allu Arjun, Allu
Advertisement
Allu Arjun Removed From A Movie Details, Allu Arjun, Icon Star Allu Arjun, Allu

అల్లు అర్జున్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలపై చాలా మక్కువ ఉండేది.చిన్నతనం నుంచే డ్యాన్సులు ఇరగదీసేవాడు.చాలా ఎనర్జిటిక్‌గా కూడా ఉండేవాడు అప్పుడే అతను హీరో లక్షణాలు బయటపడ్డాయి.

బన్నీ చిరంజీవి హీరోగా నటించిన విజేత (1985) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు.తర్వాత డాడీ (2001)లో డ్యాన్సర్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.కొన్ని సంవత్సరాలకు ఆయన స్టడీ కంప్లీట్ కాగానే ఒక పెద్ద బ్యానర్ నుంచి ఓ మంచి ఆఫర్ వచ్చింది.

దాంతో అల్లు అర్జున్ ఎంతో సంతోష పడ్డాడు.

Allu Arjun Removed From A Movie Details, Allu Arjun, Icon Star Allu Arjun, Allu

తీరా లుక్ టెస్ట్‌కి వెళ్ళిన తర్వాత ఆ మూవీ టీమ్‌ అల్లు అర్జున్ ఫేస్ బాగోలేదని నేరుగా చెప్పి అతన్ని సినిమా నుంచి తీసేశారు.ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో బాధపడ్డారు.ఆ తర్వాత ఎవరో దయతో బన్నీకి సినిమాలు చేయాల్సిన దుస్థితి రాలేదు కదా మనమే అతన్ని హీరోగా లాంచ్ చేద్దామని అల్లు అరవింద్( Allu Arvind ) నిర్ణయించుకున్నాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

వెంటనే ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌తో కలిసి "గంగోత్రి" సినిమాతో ( Gangotri ) బన్నీని హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు.దీనికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.2003, మార్చి 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డు( Nandi Award ) కూడా అందుకున్నాడు.

Advertisement

కానీ అతని యాక్టింగ్ బాగోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.దాంతో బన్నీ చాలా ఫీల్ అయిపోయాడు."చిన్నతనం నుంచి అన్నిట్లో ఫెయిలవుతూ వస్తున్నా.

సినిమాల్లో కూడా రాణించలేనా?" అని దిగులు పడ్డాడు.ఒక సంవత్సరం దాకా అతనికి ఎలాంటి ఆఫర్లు రాలేదు.

సరిగ్గా అదే సమయంలో సుకుమార్ బన్నీకి ఆర్య సినిమాలో( Arya Movie ) హీరోగా నటించే అవకాశం ఇచ్చాడు.ఇక అప్పటినుంచి నేషనల్ అవార్డు గెలుచుకునేదాకా ఈ ఐకాన్ స్టార్ తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు.

అంతేకాదు ఎంతోమంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ అయ్యాడు.

తాజా వార్తలు