పాపం అల్లరి నరేష్.. ఎంత ట్రై చేసినా కెరియర్ సెట్ కావడం లేదు ఏంటి ?

అల్లరి నరేష్.

( Allari Naresh ) ఇవివి సత్యనారాయణ కొడుకుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అల్లరి అనే సినిమాతో పరిచయమై నటించిన మొట్టమొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నాడు.

హీరో లక్షణాలు ఏమాత్రం లేవని అందరూ ఆడిపోసుకున్న తనలోని నటుడుకి పని చెప్పాడు అల్లరి నరేష్.అందుకే కమర్షియల్ హీరోగా తనకు అవకాశం దక్కదని కామెడీ వైపు అడుగులు వేశాడు.

కమెడియన్ గా చాలామంది హీరోలు గతంలో అనేక సినిమాల్లో నటించారు అలాగే మంచి కామెడీ హీరో( Comedy Hero ) అనిపించుకోవడానికి అల్లరి నరేష్ కి కూడా తన తండ్రి సినిమాలు ఉపయోగపడ్డాయి.

తన తండ్రి దర్శకుడుగా నరేష్ తో సినిమాలు తీసి హీరోగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాడు.ఆ తర్వాత నరేష్ సైతం తనదైన స్టయిల్ లో సినిమాలు చేసుకుంటూ మంచి కామెడీ హీరో అనిపించుకున్నాడు.అయితే గత కొన్నేళ్లు గా అల్లరి నరేష్ కెరీర్ గమనిస్తే విజయాల కన్నా కూడా పరాజయాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

జబర్దస్త్ స్థాయి లాంటి సినిమాలు తీస్తున్నాడని అపవాదు కూడా మూటగట్టుకుంటున్నాడు.కామెడీ సినిమాలకు( Comedy Movies ) కాలం చెల్లిపోయినట్టుగానే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే.

నరేష్ సైతం తనను తాను కామెడీ వైపే మలుచుకుంటూ వెళ్ళాడు.మంచి హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి అతనికి అవకాశం దొరకలేదు.

అందుకే కమర్షియల్ స్టార్ హీరోగా నిలబడలేక పోయాడు అల్లరి నరేష్.ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు( Aa Okkati Adakku ) అనే సినిమాతో మరోమారు తెలుగు తెరపై దండయాత్ర చేసిన అది కూడా ఏమాత్రం పని చేయలేదు.కథల ఎంపికలో లోపాలు సరైన పాత్రలు రాకపోవడం వచ్చిన కథలతో ఏదో ఒకటి మేనేజ్ చేయడం వల్ల మంచి హిట్స్ దొరకడం లేదు.

అందుకే ఇప్పటికి నరేష్ కి పాత రోత కథలే సినిమాలుగా వస్తున్నాయి.మంచి ఎమోషనల్ సీన్స్ లో కూడా నటించి మెప్పించగల నరేష్ కి మహేష్ బాబు మహర్షి సినిమాలో( Maharshi Movie ) మంచి అవకాశం ఇచ్చాడు కానీ మళ్ళీ అదే తరహా సినిమాలు చేసిన కూడా వర్క్ అవుట్ అవ్వడం లేదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

చూడాలి అల్లరి నరేష్ కెరియర్ ముందు ముందు ఎలా సాగుతుందో.

Advertisement

తాజా వార్తలు