Ajith Kumar : అజిత్ చేయాల్సిన సినిమా శింబు చేతికి ఎలా వెళ్ళింది..ఆ దర్శకుడు ఏం అయ్యాడు ?

అజిత్ చాలా గ్రేట్ ఇది అందరూ చెప్పే మాట అతని గురించి ఆయన అభిమానులు కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచిగానే చెప్తారు.

ఆయన గ్రేట్ నెస్ ఏంటి అనే విషయం ఒక చిన్న సంఘటనతో కూడా చెప్పవచ్చు.

అదేంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మురుగన్ అనే ఒక వ్యక్తి అజిత్ వాలి సినిమా( Ajith ) చూసి ఇన్స్పైర్ అయ్యి అదే కదా అంశంతో ఒక కథను రాసుకుని అందులో అజిత్ ని హీరోగా నటింపజేయాలని, దానికన్నా ముందు అతడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుని ఇండస్ట్రీలో తిరుగుతున్న రోజులవి.

నిన్నే ప్రేమిస్తా తమిళ్ రీమిక్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఆ తర్వాత తాను రాసుకున్న కథను అలాగే ఒక పోస్టర్ ని కూడా అద్భుతంగా డిజైన్ చేయించి అజిత్ కి చెప్పాడు.అజిత్ కథ మొత్తం విన్న తర్వాత ఆ పోస్టర్ చూసి ఒక్క మాట కూడా చెప్పకుండా తాను ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కానీ దానికి అజిత్ కొంతకాలం టైం అడిగాడు ప్రస్తుతం తాను చేస్తున్న మూడు సినిమాలతో బిజీగా ఉన్నందున కొంచెం టైం ఇస్తే తానే నిర్మాతను కూడా చూసి పెట్టి సినిమా చేస్తానని మాట ఇచ్చాడు.అజిత్ పోస్టర్ చూసి చాలా ముచ్చటపడ్డాడు.

ఆ పోస్టర్లో అజిత్ నుదుటి రాత స్పష్టంగా కనిపించేలా ఉంటుంది తన చుట్టూ రకరకాల భంగిమల్లో ఉన్న అమ్మాయిలు శృంగారానికి ప్రేరేపిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే గులాబీలు, పుర్రెలు కూడా ఉంటాయి ఇలా ఎఫెక్ట్ చేసింది.

Advertisement

ఇంతకీ ఆ సినిమా కథ ఏంటి అంటే మన్మధ.అజిత్ సినిమా కోసం టైం అడగగానే ఆ సినిమా డైరెక్టర్ మురుగన్( Murugan ) వేరే సినిమా కథ చెప్పడానికి శింబు ( Shimbu )దగ్గరికి వెళ్లి లవ్ లెటర్ అనే కథ చెప్పాడు.కానీ అదే సమయంలో మురుగన్ దగ్గర ఉన్న అజిత్ పోస్టర్ చూసి శింబు తాను అదే కథ చేయాలని డిమాండ్ చేయడంతో ఆ సినిమా శింబు తోనే చేయాల్సి వచ్చింది.

అజిత్ దగ్గరికి వెళ్లి చెప్పగానే ఇంత తొందరగా సినిమా సెట్ చేసుకునేందుకు అతనికి కంగ్రాట్స్ చెప్పి తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చి పంపించాడు కానీ ఆ తర్వాత మురుగన్ జీవితం ఏమయిందో అందరికీ తెలిసిందే ఆ ఒక్క సినిమాతోనే శింబు పెట్టిన టార్చర్ భరించలేక ఇండస్ట్రీ వదిలి పారిపోయాడు మురుగన్.

Advertisement

తాజా వార్తలు