Abhishek Bacchan: అభిషేక్ బచ్చన్ ఆ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవడానికి కారణం..?

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) నటి ఐశ్వర్యరాయ్ ఇద్దరు గత కొద్దిరోజులుగా విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అయితే బాలీవుడ్ మీడియాలో కూడా ఈ ప్రచారం ఎక్కువవడంతో ఈ పుకార్లు నిజమే అని అభిమానులు నమ్ముతున్నారు.

అంతేకాకుండా ఐశ్వర్యారాయ్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిషేక్ బచ్చన్ ఈ ముగ్గురు విడాకుల వార్తలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో నిజంగానే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని అందరూ భావిస్తున్నారు.అయితే ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే.అభిషేక్ బచ్చన్ గతంలో హీరోయిన్ కరిష్మా కపూర్ (Karishma Kapoor) ని ప్రేమించిన సంగతి అందరికీ తెలిసిందే.

అంతే కాదు వీరిద్దరూ 2002లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లిదాకా వచ్చాక విడిపోయారు.

Advertisement
Why Abhishek Bachchan Got Engaged To Karishma Kapoor But Married To Aishwarya R

దానికి ప్రధాన కారణం కరీనా కపూర్( Kareena Kapoor ) మాట్లాడిన మాటలే అని తెలుస్తుంది.కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ తో పెళ్లయ్యాక నువ్వు నీ కుటుంబ సభ్యులను అంటే జల్సా ( అమితా బచ్చన్ కుటుంబం ఉండే ఇల్లు పేరు ) నుండి దూరంగా రావాలని కండిషన్ పెట్టిందట.

Why Abhishek Bachchan Got Engaged To Karishma Kapoor But Married To Aishwarya R

కానీ కుటుంబం అంటే ఎంతో ప్రేమాభిమానాలు ఉన్న అభిషేక్ బచ్చన్ ఆమె కండిషన్ కి ఒప్పుకోలేదట.నేను పెళ్లయ్యాక కూడా నా ఫ్యామిలీతోనే ఉంటాను.నా ఫ్యామిలీ నుండి విడిపోను అని కరిష్మా కపూర్ కి చెప్పడం వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకున్నారట.

ఆ తర్వాత ఐశ్వరరాయ్ (Aishwarya Rai) ప్రేమలో పడిపోయిన అభిషేక్ బచ్చన్ ఆమెకి కూడా మొదట ఈ విషయాన్ని చెప్పారట.పెళ్లయ్యాక నేను నా ఫ్యామిలీతోనే ఉంటాను.

ఒకవేళ అది నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే బ్రేకప్ చెప్పచ్చు అని అన్నారట.

Why Abhishek Bachchan Got Engaged To Karishma Kapoor But Married To Aishwarya R
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం తన ఫ్యామిలీతో ఉండడానికి ఓకే చెప్పిందట.దీంతో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.ఇక వీళ్లిద్దరికి ఆరాధ్య (Aaradhya) అనే ఒక పాప కూడా ఉంది.

Advertisement

అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.దానికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో ఐశ్వర్యరాయ్ ఎక్కువగా బచ్చన్ ఫ్యామిలీతో కనిపించకపోవడం, అలాగే అభిషేక్ బచ్చన్ తన మ్యారేజ్ రింగు ని తీసేయడంతో ఈ విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి.

తాజా వార్తలు