ఎవరా ఇద్దరు : తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో వీరికే ఛాన్స్ 

మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోంది.గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా,  మళ్లీ బిజెపి( BJP ) సారధ్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు.

బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేదు.దీంతో ఏపీలో టీడీపీ సహకారం తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి ఉంది.

ఏపీలో టీడీపీ,  జనసేన,  బిజెపి కూటమిగా ఏర్పడడంతో కేంద్రం మంత్రివర్గంలోనూ ఛాన్స్ దక్కబోతోంది.దీంతో ఏపీ నుంచి రెండు క్యాబినెట్ , రెండు సహాయ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.

తెలంగాణ నుంచి ఇద్దరు బిజెపి ఎంపీలకు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.ఈనెల తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం కొలువు తీరబోతోంది  ఆ తరువాత మంత్రివర్గం ఏర్పాటుపై క్లారిటీ రానుంది.

Advertisement

తెలంగాణ నుంచి ఎవరెవరికి కేంద్ర క్యాబినెట్ లో( Central Cabinet ) అవకాశం దట్టబోవుతుందనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు గత క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి( Kishan Reddy ) మరోసారి అవకాశం ఇస్తారా లేకపోతే ఆయన స్థానంలో మరో నేతకు అవకాశం ఇస్తారని తేలల్సి ఉంది.రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి , డీకే అరుణ పేర్లను బిజెపి అధిష్టానం పరిశీలిస్తుందట.వీరిలో ఒకరికి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం .అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను( Bandi Sanjay ) కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది .బీసీ కోటాలో ధర్మపురి అరవింద్ ,( Dharmapuri Arvind ) ఈటెల రాజేందర్( Etela Rajendar ) పేర్లు పరిశీలనకు వచ్చాయట. అయితే ఈటెల నుంచి బండి సంజయ్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది .ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని బిజెపి అగ్రనేతలు గతంలోనే సంకేతాలు ఇవ్వడంతో,  బీసీ కోటాలో ఎవరికి మంత్రి పదవి దక్కపోతుందనేది తెలంగాణ బిజెపిలో ఆసక్తి రేపుతోంది.

ధర్మపురి అరవింద్ కు సహాయం మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.తెలంగాణలో బిజెపి మరింత బలోపేతం అయ్యే విధంగా మంత్రి పదవుల విషయంలో బిజెపి అధిష్టానం చాలా జాగ్రత్తలే తీసుకుంటుంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిగా బిజెపి ప్రభావం కనిపించే విధంగా వ్యవహారాలు మొదలు పెట్టబోతోంది .దీనిలో భాగంగానే బీఆర్ఎస్ , కాంగ్రెస్ లను అన్ని విషయాలలోను ఇరుకును పెట్టగల బలమైన నేతలకు కేంద్ర మత్రి పదవులు దక్కే అవకాశం ఉండబోతోంది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు