రష్యా వ్యాక్సిన్ పై షాకింగ్ విష‌యాలు తెలిపిన డబ్ల్యూహెచ్‌వో!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌.ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌త ఏడాది డిసెంబ‌రులో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగు చూసిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.అగ్ర‌దేశాల‌ను సైతం చిగురుటాకులా‌ వ‌ణికిస్తోంది.

ఇక ఈ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌స్తే గాని అంతం కాద‌ని తేల‌డంతో.ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా విరుగుడు కోసం వంద‌ల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నారు.

ఈ క్ర‌మంలోనే మా వ్యాక్సిన్ అప్పుడు వ‌స్తుంది, ఇప్పుడు వ‌స్తుంది అంటూ దేశాలన్నీ మీడియా ముందు ప్రకటనలు చేస్తుండగా రష్యా మాత్రం ఏకంగా మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది.ప్రపంచంలోనే మొట్ట మొదటి క‌రోనా వ్యాక్సిన్ గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం `స్పుత్నిక్-వీ` పేరిట వ్యాక్సిన్‌ను విడుదల చేశారు.

Advertisement
Russia Corona Vaccine Not In Advanced Test Stages Says By WHO! Russia, Corona Va

ఈ టీకా వేయించుకుంటే రెండేళ్లపాటు క‌రోనా‌ నుంచి రక్షణ పొందొచ్చ‌ని ఆయన తెలిపారు.అంతేకాదు, ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ను రష్యా అధ్యక్షుడు స్వయంగా తన కూతురుకే ఇప్పించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

Russia Corona Vaccine Not In Advanced Test Stages Says By Who Russia, Corona Va

ఆయ‌న కుమార్తె శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తిఅయినట్టు కూడా వెల్లడించారు.కానీ, సరైన క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండానే ఆ టీకాను తయారుచేశారన్న ప్ర‌చారం జ‌రుగుతున్న‌ నేపథ్యంలో దానిని కొనుగోలు చేయాలా? వద్దా? అన్నదానిపై ప్ర‌పంచ‌దేశాలు తర్జనభర్జన పడుతున్నాయి.అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డబ్ల్యూహెచ్‌వో) షాకింగ్ విష‌యాలు తెలిపింది.

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ అడ్వాన్స్ స్టేజ్ లో లేదని పేర్కొంది.అలాగే రష్యా వ్యాక్సిన్ పై తగినంత సమాచారం లేదు కాబట్టి దాని సమర్థత పై నిర్ణయానికి రాలేమని డబ్ల్యూహెచ్‌వో స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం ఈ టీకా ఏ దశలో ఉందో అర్థం చేసుకోవడానికి రష్యాతో సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపింది.ఇక‌ ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో తొమ్మిది వ్యాక్సిన్లు మాత్రమే ప్రయోగదశలో ముందున్నాయని పేర్కొంది.

ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

మ‌రోవైపు రష్యా వ్యాక్సిన్‌ విషయంలో అస్స‌లు మూడో దశ పరీక్షలే జరగలేదంటూ ప్ర‌పంచ‌దేశాల శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు