Sai Pallavi : భోళా శంకర్ సినిమా కోసం చిరు చెల్లెలిగా నటించను అని చెప్పిన హీరోయిన్ ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు.ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కూడా నటించారు.ఈ సినిమా 2015లో విడుదలైన తమిళ సినిమా వేదాళంకు అఫీషియల్ రీమేక్.

ఈ సినిమాలో సాయి పల్లవిని మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా చూపించాలని డైరెక్టర్ అనుకున్నాడు కానీ అది కుదరక మహానటి ఫేమ్ కీర్తి సురేష్( keerthy Suresh ) ని ఎంపిక చేసుకున్నాడు.భోళాశంకర్‌లో ఈ పాత్ర తన వద్దకు వచ్చినప్పుడు సాయి పల్లవి సింపుల్‌గా రిజెక్ట్ చేసింది.

కథ కూడా ఆమె వినలేదట.

Advertisement

లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌లో, సాయి పల్లవి( Sai Pallavi ) ఈ విషయంపై స్పందించింది కూడా.భోళాశంకర్‌లో కావాలని నటించలేదని ఆమె తెలిపింది.ఆమెకు రీమేక్‌లు ఇష్టం లేదని, అందుకే ఆమె ఈ సినిమాను తిరస్కరించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సాయి పల్లవి ఈ సినిమాను తిరస్కరించడంపై అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని, అనవసరంగా సాయి పల్లవి మంచి అవకాశాన్ని కోల్పోయిందని వాళ్లు కామెంట్స్ చేశారు.

భోళాశంకర్ సినిమా( Bhola Shankar ) విడుదలైన తర్వాత, దాని వసూళ్ళను బట్టి సాయి పల్లవి మంచి అవకాశాన్ని కోల్పోయారో లేదో చూడవచ్చు.

ఇకపోతే ఈ అప్‌కమింగ్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి భార్య పాత్రను పోషిస్తోంది.మాజీ టాలీవుడ్ హీరో సుశాంత్ కీర్తి సురేష్ భర్తగా కనిపించనున్నాడు.సినిమా పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, భోళాశంకర్ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

ఈ సినిమాలో చిరంజీవి మాజీ గ్యాంగ్‌స్టర్ తన దత్తత సోదరి రాధ (కీర్తి సురేశ్)తో కలసి ఆమె విద్య కోసం, రాధ కుటుంబ మరణానికి కారణమైన క్రైమ్ నెట్‌వర్క్‌ను వేటాడేందుకు కోల్‌కతా వస్తాడు.తర్వాత వారిని ఎలా అంతమోదిస్తాడనేది ఈ మూవీ కథాంశం.

Advertisement

తాజా వార్తలు