వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ మధ్య బ్రేకప్ కి కారణం ఎవరు..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడు విశాల్( Vishal ) చాలా అద్భుతమైన సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ తో( Varalakshmi Sarath Kumar ) తన ప్రేమాయణం నడిపినట్టుగా అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

ఇక నిజానికి "పందెంకోడి 2" సినిమాలో విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు కలిసి నటించారు.అయితే ఈ సినిమాలో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండడం అలాగే వరలక్ష్మి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంతో వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అనే న్యూస్ అయితే అప్పట్లో వైరల్ అయింది.

ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అలాగే బయట కూడా కలిసి తిరుగుతున్నారు అనే ఉద్దేశ్యం లో వార్తలైతే వచ్చాయి.ఇక ఒకానొక సమయంలో వీళ్లు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట.కానీ దానికి వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ నాన్న అడ్డుపడడంతో వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్( Breakup ) అయినట్లు తెలుస్తుంది.

ఇక దాంతో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తను నికొలాయ్ సఛ్ దేవ్( Nicholai Sachdev ) తో పెళ్లి కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా వాళ్ళకి నిశ్చితార్థం కూడా జరిగిన విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఇక తన చిన్ననాటి ఫ్రెండ్ గా ఉన్న నికోలాయ్ ను పెళ్లి చేసుకోవడం వెనక వరలక్ష్మి చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే తను ఒక ఇంటి మెంబర్ అవడం అనేది అందర్నీ ఆనందానికి గురి చేస్తున్నాడనే చెప్పాలి.ఇక రీసెంట్ గా హనుమాన్ సినిమాలో తేజ సజ్జా అక్కగా నటించింది.

అయితే ఈ పాత్రలో చాలా బాగా నటించిందనే చెప్పాలి.ఇక ఇప్పుడు విశాల్ కూడా ఆమె పెళ్లి పట్ల చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

Advertisement

తాజా వార్తలు