పంచ కన్యలు అంటే ఎవరు, వారి వృత్తాంతం ఏమిటి?

అహల్యా ద్రౌపదీ కుంతీ (తారా) తారామండోదరీ తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్.

అన్న శ్లోకం ప్రసిద్ధం.

అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి.ఈ ఐదుగురు పంచకన్యలు.

వీరిని ప్రతి నిత్యమూ స్మరించాలని పండితులు చెబుతున్నారు.ఆ స్మరణ మహా పాతకాలను నశింప జేస్తేంది అని భావం.

శ్లోకంలో కుంతికి బదులు తార పేరును రెండు సార్లు చెప్తుంటారు కొంత మంది.ఒక తార బృహస్పతి భార్య కాగా.

Advertisement

మరొక తార వాలి భార్య అని గ్రహించాలి.కుంతిని గ్రహిస్తే ఒక తారనే చెప్పాలి.

అహల్య గౌతముని భార్య, ద్రౌపది పంచ పాండవుల ధర్మ పత్ని. కుంతి పాండురాజు భార్య, మండోదరి రావణుని భార్య.

ఈ పంచకన్యలూ మహా పతివ్రతలు.అద్భుతమైన అంద చందాలు కలవారు.వీరిని బ్రహ్మ విశిష్టమైన దివ్య లక్షణాలతో సృష్టించాడు.

సౌందర్యం, సౌకుమార్యం, సౌశీల్యం వంటి సుగుణాలు వీరందరిలోనూ సమృద్ధిగా ఉన్నాయి.ఒకసారి వివాహితలైనా, సంతతి కల్గి వున్నా వీరి కన్యాత్వానికి భంగం లేదు.

Hair Growth Treatment : ఈ రెండు ప‌దార్థాల‌తో పొడ‌వాటి జుట్టును పొందొచ్చు.. తెలుసా?

మరణించే వరకూ వీరు నిత్య యువతులుగా ఉంటారు.నిత్య కన్యల వలె శోభిల్లుతారు.

Advertisement

సృష్టి కర్త వీరికి ప్రసాదించిన వరమది.గౌతముని భార్య అహల్య ఇంద్రుణ్ణి ప్రేమించింది.

కుంతి కన్యగా ఉంటూనే సూర్యుణ్ణి వరించింది.కర్ణునికి తల్లి అయింది.

ద్రౌపది పంచ భర్తృక.బృహస్పతి భార్య చంద్రునికి గూడా గృహిణి అయింది.

మరొక తార వాలి సుగ్రీవు లిరువురికీ భిన్న భిన్న కాలాలలో పత్నిగా వ్యవహరించింది.మండోదరి కృత్స్నమదుడు మంత్రించిన పాలు త్రాగి గర్భవతి అయింది.

కన్యను ప్రసవించింది.ఈ రీతిగా పరిశీలిస్తే ఈ ఐదుగురూ ఒక్కొక్క పద్ధతిలో చరిత్ర సృష్టించిన నారీమణులే.

భారత రామాయణాది విశిష్ట గ్రంథాలు వీరిని విశిష్ట వనితలుగా వర్ణించాయి.

తాజా వార్తలు