పుష్కరిణి అభివృద్ధి కోసం తవ్వకాలు జరుపుతుండగా అద్భుత దృశ్యం.. భారీగా తరలివచ్చిన భక్తులు..

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో అద్భుత ఘటన జరిగింది.

ఈ దేవాలయంలో పుష్కరిణి అభివృద్ధిలో భాగంగా పనులు నిర్వహిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని దృశ్యం అందరినీ ఆశ్చర్యంగా గురి చేసింది.

ఇంకా చెప్పాలంటే మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది.ఈ దేవాలయాన్ని సందర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి వారిని ప్రతి రోజు దర్శించుకుంటూ ఉంటారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఉన్న పుష్కరిని అభివృద్ధి చేసే క్రమంలో గత రెండు నెలల నుంచి నీటిని బయటకు తోడుతున్నారు.ఈ క్రమంలోనే నీటి మట్టం తగ్గడంతో బుధవారం పుష్కరిణి లో రెండు శివ లింగాలు బయటపడ్డాయి.

చాలా సంవత్సరాల నాటి శివ లింగాలు దర్శనం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న దేవాలయాల అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శివ లింగాలను పాలతో అభిషేకం చేశారు.అంతే కాకుండా ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివస్తున్నారు.

Advertisement

ఎన్నో సంవత్సరాల నాటి శివలింగాలను దర్శించుకునేందుకు భారీగా ఆలయనికి క్యూ కడుతున్నారు.

ఇదిలా ఉండగా కోనేరులో మరో 25 అడుగుల నీరు ఉంది.అంతే కాకుండా ఈ మొత్తం నీటిని బయటకు తోడేలోపు శివలింగాలు ఇంకా బయటపడే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు.నీటిని పూర్తిగా బయటకు తీసిన తర్వాత భక్తులు పుష్కరిణి లోనికి దిగి శివ లింగాలను పూజించుకునేందుకు ఏర్పాట్లను కూడా చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

అంతేకాకుండా ఈ శివలింగాలు ఏ కాలానికి చెందిన వో ఇంకా తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి14, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు