ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీలన్నీ పోరుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.ఈ మేరకు ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు.
గుడివాడపై పార్టీ నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రెండు గ్రూపులుగా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇంఛార్జ్ రావి వెంకటేశ్వర రావు, ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామ్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీనిపై ఇవాళ సాయంత్రం రావి వెంకటేశ్వర రావు చంద్రబాబును కలవనున్నారు.
రావి భవిష్యత్ పై భరోసా ఇచ్చి ఎన్ఆర్ఐ రామ్ ను బరిలో నిలపాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఇవాళ సమావేశంలో రావికి చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారని పార్టీలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది.