గ్రహ దోష నివారణకు... ఏ వినాయకుడిని పూజించాలో తెలుసా?

సాధారణంగా వినాయకుడిని ప్రథమ పూజ్యుడు అని భావించి అతనికి పూజలు చేస్తుంటారు.

వినాయకుడికి ప్రథమ పూజ చేయడం వల్ల మనం చేసే ఎటువంటి శుభకార్యమైనా ఏ అడ్డంకులు లేకుండా ఆ కార్యక్రమం సజావుగా నెరవేరుతుందని ఆ వినాయకుడిని పూజిస్తాము.

కానీ ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు వివిధ రకాల లోహాలతో తయారు చేసిన వినాయక ప్రతిమలకు పూజలు చేస్తూ ఉంటారు.గణపతి ఆరాధన లో చాలా రకాలు ఉన్నాయి.

Ganapthi, Graha Dosham, Hindu Rituals, Kuja Graha Dosham, Surya Graha Dosham, Ra

గ్రహ దోషాలతో బాధపడేవారు వినాయకుడిని పూజించడం వల్ల గ్రహ దోష నివారణ జరిగి శుభం కలుగుతుంది.ఏ గ్రహ దోషం వల్ల బాధపడేవారు ఏ లోహం తో తయారు చేసిన విగ్రహాన్ని పూజించడం వల్ల శుభం కలుగుతుంది ఇక్కడ తెలుసుకుందాం.

సూర్య గ్రహ దోషాలతో బాధపడేవారు ఎర్రచందనం తో తయారుచేసిన గణపతిని పూజించడం వల్ల దీర్ఘకాలికంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు తొలగిపోయి, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.చంద్రగ్రహణ దోషంతో బాధపడేవారు తెల్లటి పాలరాతి తో తయారుచేసిన వినాయకుడి విగ్రహాన్ని పూజించడం ద్వారా మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.

Advertisement

అంతేకాకుండా వారి జీవితం ఎంతో ప్రశాంతంగా కొనసాగుతోంది.కుజ గ్రహ దోష నివారణకు రాగితో చేసిన గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు.

బుధగ్రహ నివారణకోసం మరకత గణపతిని పూజించాలి.గురు గ్రహ నివారణ కోసం పసుపు తో తయారు చేసిన వినాయకుడిని లేదా బంగారు వినాయకుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

శుక్ర గ్రహ దోష నివారణకు స్పటిక వినాయకుని పూజించడం వల్ల సుఖశాంతులను ప్రసాదిస్తాడు.శనిగ్రహ దోష ప్రభావం ఉన్నవారు నల్ల రాతిపై చెక్కిన వినాయకుడి ప్రతిమను పూజించడం ద్వారా శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది.

రాహు గ్రహ దోషం ఉన్నవారు మట్టి గణపతి ని పూజించడం ద్వారా గ్రహ దోష నివారణ జరిగి శుభం జరుగుతుంది.కేతు గ్రహ దోష నివారణ కోసం తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడి ప్రతిమ పూజించటం వల్ల గ్రహ దోష నివారణ జరుగుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు