బాబు వచ్చేదెప్పుడు.. ముందుకు సాగేదెప్పుడు ?

చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) తరువాత టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.

అంతకు ముందు టీడీపీ వేసుకున్న ప్లాన్స్ అన్నీ బాబు అరెస్ట్ తో పటాపంచలు అయ్యాయి.

జగన్ పై వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ చంద్రబాబు చేసిన పర్యటనలన్నీ ఆగిపోయాయి.అటు లోకేశ్ యువగళం పాదయాత్రకు కూడా బ్రేక్ పడింది.

ప్రస్తుతం లోకేశ్ కూడా వివిధ కేసులను ఎదుర్కొంటున్నాడు.ఆయన కూడా జైలుకు వెళ్తాడానే భయం పార్టీ నేతలను వేదిస్తోంది.

దీంతో ఎన్నికల ముందు టీడీపీ ఒక్కసారిగా స్లో అయింది.పార్టీలోని కీలక నేతలెవరూ పర్యటనలు బహిరంగ సభలు నిర్వహించడానికి పూనుకోవడం లేదు.

Advertisement

పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీ మరింత బలహీన పడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ప్రస్తుతం పార్టీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు ఆగిపోయాయి.ఇప్పుడు టీడీపీ ముందున్న ఒకే ఒక్క ఎజెండా.

అధినేతను చంద్రబాబును బయటకు తీసుకురావడం.మరోవైపు దొరికిందే ఛాన్స్ అని ఏకంగా వచ్చే ఏడాది జనవరి వరకు టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు.

వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రాణాలికలు రచించారు.టీడీపీ ఊసే లేకుండా.

ప్రజలంతా వైసీపీ నామజపం చేసేలా జగన్( YS Jagan Mohan Reddy ) వ్యూహాలను రచించారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

వచ్చే ఏడాది జనవరి వరకు నేతలను ప్రజల మద్య ఉంచి ఫిబ్రవరిలో మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.ఆయన ఇదే జోష్ కొనసాగితే టీడీపీ ఓటు బ్యాంక్ కూడా గండి పడడం ఖాయమనేది కొందరి అభిప్రాయం.అటు టీడీపీ పొత్తులో ఉన్న జనసేన సైతం కేవలం వారాహి యాత్ర( Varahi Yatra ) వరకే పరిమితం అయింది.

Advertisement

ప్రజల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు పవన్.ఇదే వైఖరి కొనసాగితే టీడీపీ జనసేన కూటమి వల్ల ఒరిగేదెమి ఉండదని, వైసీపీకె విజయావకాశాలు ఎక్కువ అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి టీడీపీ మళ్ళీ పుంజుకోవన్నా, తదుపరి కార్యక్రమాలు ముందుకు సాగాలన్నా చంద్రబాబు బయటకు రావడం ఖాయంగా మారింది.మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో.టీడీపీ ఎప్పుడు ప్రజల్లో యాక్టివ్ అవుతుందో చూడాలి.

తాజా వార్తలు