మురారిలో మహేష్ తండ్రి పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మురారి ఒకటనే సంగతి తెలిసిందే.

మహేష్ బాబు, సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించగా కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

బాలనటుడిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా మురారి తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.ఈ సినిమాలో మహేష్ బాబు అద్భుతంగా నటించారు.

ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రసాద్ బాబు నటించారు.అయితే మొదట ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్రలో నటించే అవకాశం ప్రముఖ నటుడు నరసింహరాజుకు వచ్చింది.

సింధూరం సినిమాలో చిన్న పాత్ర చేసిన నరసింహరాజుకు కృష్ణవంశీ మురారి సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు.మురారి సినిమాలోని తల్లి పాత్రకు లక్ష్మిని ఫిక్స్ చేసిన కృష్ణవంశీ నరసింహరాజుకు మహేష్ తండ్రి పాత్రలో నటించాలని కోరగా ఆయన కృష్ణవంశీ ఆఫీస్ కు వచ్చారు.

When Narasimhar Raju Missed To Play Mahesh Father Role In Murari, Murari Movie ,
Advertisement
When Narasimhar Raju Missed To Play Mahesh Father Role In Murari, Murari Movie ,

అయితే మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటించడం ఇష్టమే అయినా లక్ష్మికి భర్తగా సరిపోతానా ? వెంటాడటంతో కృష్ణవంశీ దగ్గర అదే సందేహాన్ని నరసింహరాజు వ్యక్తం చేశారు.చూడటానికి అసలు వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపించే నరసింహరాజు వ్యక్తం చేసిన సందేహం వల్ల కృష్ణవంశీకి కూడా అదే డౌట్ వచ్చింది.ఆ తర్వాత నరసింహరాజు ఆ పాత్రకు ప్రసాద్ బాబును సూచించారు.

When Narasimhar Raju Missed To Play Mahesh Father Role In Murari, Murari Movie ,

చివరకు కృష్ణవంశీ ప్రసాద్ బాబుకు ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వగా ప్రసాద్ బాబు ఆ సినిమాలో నటించడం ఆ సినిమా సక్సెస్ సాధించడం జరిగింది.ఒకవేళ నరసింహరాజు ఆ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఆ పాత్ర నరసింహరాజు సినీ కెరీర్ కు ఖచ్చితంగా ప్లస్ అయ్యి ఉండేది.

Advertisement

తాజా వార్తలు