వరదలా వస్తున్న వాట్సాప్ అప్డేట్స్... పుష్ నేమ్ వంతు వచ్చింది!

వాట్సాప్ మంచి స్వింగ్ లో వుంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ వినియోగదారులకు మరింత చేరువౌతోంది.

ఐఓయస్ స్టాండర్డ్ వాట్సాప్ యూజర్లకు పుష్ నేమ్ ఫీచర్ ఒకదానికి తాజాగా రిలీజ్ చేసినట్టు సమాచారం.ఐఓయస్ వాట్సాప్ 23.1.75 అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లకు ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.రీసెంట్ టైమ్స్‌లో రిలీజ్ చేసిన ఈ పుష్ నేమ్ చాలామంది దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవాలి.ముందు ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.22.25.9 వెర్షన్‌లో కనిపించిన ఈ ఫీచర్, తాజాగా ఐఓయస్ స్టాండర్డ్ వాట్సాప్ యూజర్లకు కూడా రిలీజ్ కావడం గమనార్హం.

టెస్ట్ ఫ్లైట్ యాప్‌ నుంచి ఈ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.ఇకపోతే దీని వలన ఉపయోగం ఏమంటే, సాధారణంగా వాట్సాప్ గ్రూప్‌లోని చాట్ సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ తప్ప మిగతా పార్టిసిపెంట్ల పేర్లు తెలియవు.తెలియని నంబర్ నుంచి గ్రూప్ చాట్‌లో ఏదైనా మెసేజ్ వస్తే వారెవరనేది తెలుసుకునేందుకు, ఆ గ్రూప్ చాట్‌పై క్లిక్ చేసి నేమ్ తెలుసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇదంతా టైమ్‌తో కూడుకున్న పని.అందుకే వాట్సాప్ తెలియని నంబర్లకు బదులుగా వాటి పుష్ నేమ్స్ చాట్ లిస్టులో చూపించేందుకు "పుష్ నేమ్ విత్ ఇన్ ద చాట్ లిస్ట్‌" ఫీచర్‌ను విడుదల చేసింది.

Advertisement

ఇక్కడ పుష్ నేమ్ అంటే ప్రొఫైల్ నేమ్ అని అర్థం అన్నమాట.గ్రూప్ చాట్ లిస్టులోనే కాకుండా ఒక గ్రూప్ పార్టిసిపెంట్ పుష్ నేమ్ అనేది నోటిఫికేషన్లలో కూడా కనిపిస్తుంది.ప్రముఖ వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ పనితీరుకు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ స్క్రీన్‌షాట్‌ ప్రకారం.గ్రూప్ చాట్‌లలో మెసేజ్ బబుల్‌లో ఫోన్ నంబర్‌ల ప్లేస్‌లో పుష్ నేమ్ కనిపించింది.

ఈ ఫీచర్ ఫోన్ నంబర్‌ కంటే పుష్ నేమ్‌కే అధిక ప్రాధాన్యతనిస్తుంది.తద్వారా తెలియని గ్రూప్ పార్టిసిపెంట్స్‌ను గుర్తించడం వినియోగదారులకు సులభతరం చేస్తుంది.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling
Advertisement

తాజా వార్తలు