వాట్సాప్ పేమెంట్స్ లో స్టిక్కర్స్ ఫీచర్.. !!

ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.

అలాగే వాట్సాప్ కూడా తన వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకర్షించడానికి కొత్త కొత్త ఫీచర్లను జోడిస్తూ వస్తుంది.

ఈ క్రమంలోనే వాట్సాప్ ఈ మధ్య కాలంలో పేమెంట్​ మోడ్​ అనే సరికొత్త ఫీచర్​ను జోడించింది.అయితే మీరు ఎవరికైనా పేమెంట్​ చేసేటప్పుడు ఆ పేమెంట్​ నేపథ్యాన్ని స్టిక్కర్​ రూపంలో వేరే వ్యక్తికి తెలియజేయవచ్చు అన్నమాట.

భాషతో సంబంధం లేకుండా కేవలం స్టిక్కర్స్ రూపంలో మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని అవతలి వ్యక్తికి ఈ స్టిక్కర్ల రూపంలో తెలియచేయవచ్చు అన్నమాట.ఈ నేపథ్యంలో ఈ స్టిక్కర్​ ప్యాక్​ల గురించి వాట్సాప్ ఇండియా పేమెంట్స్ డైరెక్టర్ మనేష్ మహాత్మే మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

మీరు చేసే ప్రతి చెల్లింపు వెనుక ఒక స్టోరీ దాగి ఉంటుంది కదా.అందుకే మీరు చేసే చెల్లింపు వెనుక ఉన్న కథను ఇలా స్టిక్కర్​ రూపంలో అవతలి వ్యక్తికి తెలియజేసేందుకు.ఈ సరికొత్త ఫీచర్​ను మీ ముందుకు తీసుకుని వచ్చామని తెలిపారు.

Advertisement
Whatsapp New Feature With Stickers In The Payments Feature, What's Up, Payment,

ఈ నూతన ఫీచర్​తో వాట్సాప్ డిజిటల్​ పేమెంట్లు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.డిజిటల్​ పేమెంట్​ వ్యవస్థలో 500 మిలియన్ల మార్కును చేరుకునే లక్ష్యంగా తాము ఐదుగురు నైపుణ్యం కలిగిన మహిళా కళాకారులతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.

మరి ఆ ఐదుగురు మహిళా కళాకారులు ఎవరు, ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Whatsapp New Feature With Stickers In The Payments Feature, Whats Up, Payment,

వారిలో అంజలి మెహతా కూడా ఒకరు.ఈమె దేశంలోనే పేరొందిన హ్యూమన్స్​ సైకాలజిస్ట్​.ఆమె ఇప్పటికే ఎన్నో చిత్రాలను గీశారు.

తన ఫోటోగ్రఫీతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు.అలాగే మరొక కళాకారిణి అనుజా పోతిరెడ్డి.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

ఈమె కూడా దేశంలోనే పేరొందిన స్కెచ్ ఆర్టిస్ట్, జిఫ్​ క్యూరేటర్.ఆమె వాట్సాప్ ప్యాక్​లు పే ఓకే ప్లీజ్​ పేరుతో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఒషీన్​ సిల్వా భారతీయ ఉత్తమ చిత్రకారుల్లో ఒకరు.ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ఫిక్షన్ లెన్స్ ద్వారా చిత్రాలను బాగా గీస్తారు.

సబ్సే బడా రూపాయ్​ పేరుతో ఆమె స్టిక్కర్​ ప్యాక్​లు అందుబాటులో ఉన్నాయి.

అలాగే నీతి కూడా మంచి కళాకారిణి.డ్రీమ్స్​ చిత్రాలు, జీవిత సత్యాలు గీయడంలో ఆమె దిట్ట.ఆమె స్టిక్కర్ ప్యాక్​లు పే ఆధా లేదా జ్యాదా పేరుతో అందుబాటులో ఉన్నాయి.

ముంబై కి చెందిన మీరా ఫెలిసియా మల్హోత్రా ఒక ఫేమస్​ గ్రాఫిక్ డిజైనర్.ఆమె స్టిక్కర్​ ప్యాక్​లు అప్నా సప్నా మనీ పేరిట అందుబాటులో ఉన్నాయి.

తాజా వార్తలు