కేబీసీ లాటరీ పేరుతో మోసం.. దీని బారిన పడకుండా ఉండాలంటే..

స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా మనిషి జీవితంలో అంతర్భాగంగా మారాయి.బ్యాంకింగ్ మొదలుకొని సామాజిక జీవితం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌గా మారుతోంది.

అటువంటి పరిస్థితిలో ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగిపోయాయి.ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాలకు సంబంధించిన ఉదంతాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి.

ఇటీవల ఈ కోవకు చెందిన ఒక వాట్సాప్ సందేశం వైరల్ అవుతోంది.కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) పేరుతో మోసం చేస్తున్న ఒక ముఠా తమ అక్రమాలను వాట్సాప్ సాయం తీసుకుంటోంది.

ఈ దుండగులు వాట్సాప్‌లో లాటరీ ప్రైజ్‌లు గెలుచుకోవచ్చంటూ సందేశాలు పంపుతూ జనాలను తమ వలలో వేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ పేరుతో వాట్సాప్‌లో ఫోటో, ఆడియో క్లిప్ పంపిస్తున్నారు.

Advertisement

ఈ క్లిప్‌లో మోసం చేస్తున్న వ్యక్తి వినియోగదారుతో.అతని పేరు మీద లాటరీని దక్కించుకున్నట్లు చెబుతాడు.ఆడియో క్లిప్‌లో ఉన్నదాని ప్రకారం, మీ పేరు మీద రూ.25 లక్షల విలువైన లాటరీ వచ్చింది.Jio, Airtel, Vodafone Idea, BSNL మొబైల్ నంబర్‌ల నుండి మీ నంబర్ ఎంపికయ్యింది.

ఈ లాటరీని దక్కించువడానికి మీరు వాట్సాప్‌లో లాటరీ మేనేజర్‌కి కాల్ చేయాలి.వారు బహుమతిని పొందే పూర్తి ప్రక్రియను మీకు వివరిస్తారని ఉంది.ఆడియో క్లిప్‌తో పాటు ఓ ఫోటోను కూడా షేర్ చేశారు.మీ పేరు మీద రూ.25 లక్షల లాటరీ వచ్చిందని చెబుతారు.అయితే ఈ డబ్బు పొందడానికి మీరు కంపెనీ నిబంధనలను అనుసరించాలి.

లాటరీ నిర్వాహకుడికి సాధారణ కాల్ చేయలేమని, కాబట్టి మీరు అతనిని వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించాలని ఆడియో సందేశంలో ఉంటుంది.నిజానికి ఈ ప్రక్రియ అంతా పక్కాప్లాన్‌తో జరిగే మోసం.

మీకు ఇలాంటి సందేశం ఏదైనా వస్తే, వెంటనే దాన్ని విస్మరించి, ఈ నంబర్‌ని బ్లాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి
Advertisement

తాజా వార్తలు