వాట్సప్ దూకుడు... మరో కొత్త యాప్!

ఎప్పటికప్పుడు వాట్సప్( Whatsapp ) తన వినియోగదారుల కోసం కొత్త కొత్త అప్డేట్లు తీసుకొస్తూ వుంది.

ఈ క్రమంలోనే వాట్సాప్ మరో క్రేజీ అప్‌డేట్ తీసుకు వచ్చేసింది.

అవును, తాజాగా డివైస్‌లను లింక్ చేయడం సులభతరం చేసేందుకు ఓ కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.ఒక యూజర్ గరిష్టంగా 4 డివైజ్‌లతో వాట్సప్‌ని లింక్ చేయొచ్చు.

ఫోన్ ఆఫ్ లో ఉన్నాసరే ఛాట్స్ సింక్ అవుతాయి.డివైజ్‌ల లింక్ మరింత సులభతరం చేయడానికి, విండోస్ కోసం పూర్తిగా కొత్త యాప్‌ని తీసుకురావాలని యోచిస్తోంది.

కాగా వాట్సప్ యూజర్లు కొత్త విండోస్ యాప్‌ని( new Windows app ) వాట్సాప్ అధికారిక లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేయొచ్చు.సదరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ , ఐఓఎస్, విండోస్ యాప్స్ లింక్స్ వేర్వేరుగా కనిపిస్తాయి.తరువాత విండోస్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సప్ యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

Advertisement

ఇకపోతే వాట్సప్ తాజాగా మరో 2 ఫీచర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.వాట్సప్ గ్రూప్స్ కోసం కొత్త ఫీచర్స్ వచ్చాయి.వాట్సప్ గ్రూప్‌లో ఎవరు చేరాలన్నదానిపై అడ్మిన్లకు ఇకనుండి ఆయా గ్రూప్స్ పైన మరింత నియంత్రణ వుండబోతోంది.

గ్రూప్‌లో సభ్యుల సంఖ్యను పెంచడం, గ్రూప్‌లో ఏ మెసేజ్‌నైనా డిలిట్ చేసే అధికారం కూడా ఇపుడు గ్రూప్ అడ్మిన్లకు ( group admins )ఇవ్వడం జరుగుతోంది.ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదు.ఎవరన్నా ఏదైనా గ్రూప్స్ లో అసభ్యకరమైన పోస్ట్ పెట్టినపుడు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

కానీ ఇపుడు అలాంటిది లేదు.గ్రూప్ అడ్మిన్స్ కు అన్ని అధికారాలు ఉంటాయి.

అంతేకాకుండా ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలను ఒకేసారి 100 ఫైల్స్ షేర్ చేసే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది వాట్సాప్.దీనిగురించి మీరు వినే వుంటారు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

ఈ ఫీచర్ బీటా వర్షన్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.బీటా యూజర్లు ఈ ఫీచర్స్ టెస్ట్ చేసిన తర్వాత యూజర్లందరికీ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి.

Advertisement

తాజా వార్తలు