అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరుగుతుంది..?

పుష్ప 2( Pushpa 2 ) సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ లో( Sandhya Theatre ) జరిగిన తొక్కిసలాట లో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.

ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ మీద భారీ ఒత్తిడిని తీసుకొస్తూ ఆయన తో పాటు మిగిలిన సినీ ప్రముఖులందరి మీద సీఎం భారీగా ఫైర్ అయ్యారు.

మరి మొత్తానికైతే ఆయన చేసిన దాంట్లో తప్పు ఎవరిదైనా కూడా ఒక నిండు ప్రాణం పోయిందనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అలా ఫైర్ అయ్యారు అంటూ కొంతమంది రేవంత్ రెడ్డి పక్షాన మాట్లాడుతుంటే మరి కొంత మంది మాత్రం అల్లు అర్జున్ పక్షాన మాట్లాడుతూ ఆయనకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

ఇక ఈ ఎంటైర్ సిచువేషన్ లో సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టం జరగబోతుందని గ్రహించిన సినిమా పెద్దలు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అరేంజ్ చేశారు.ఇకమీదట బెనిఫిట్ షోస్, టిక్కెట్ రేట్ విషయానికి సంబంధించి ఎలాంటి బెన్ఫిట్స్ ఇక సినిమా ఇండస్ట్రీ కి ఉండబోవు అని సిఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి తో మీట్ అయి దానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది.

ఇక దీంతో అల్లు అర్జున్ కేసుని కూడా వదిలేయమని వాళ్ళు వేడుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కి ఈ మీటింగ్ తో ఉపశమనం దొరుకుతుందా లేదంటే మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదా అనే అంశం మీద భారీ చర్చలు అయితే జరుగుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న అల్లు అర్జున్ ఈ దెబ్బతో మంచి హీరోగా అవతరించినప్పటికి ఆయన ఇమేజ్ మాత్రం కొంతవరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి.

Advertisement
సుకుమార్ ఇండస్ట్రీకి రావడానికి స్పూర్తి ఆ హీరోనా.. ఈ షాకింగ్ విషయం తెలుసా?

తాజా వార్తలు