చలికాలంలో ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?

శీతాకాలం వచ్చిందంటే చాలు చల్లటి వాతావరణంతో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు ఎముకలు, కీళ్లు సహా శరీరం మొత్తం పై ఎఫెక్ట్ పడుతుంది.

చలి వాతావరణంతో ఎముకలు, కీళ్లు( Bones joints ) గట్టిగా మారి నొప్పులకు దారితీస్తుంది.

అలాగే కొన్నిసార్లు అదుపుతప్పి కింద పడే అవకాశాలు కూడా ఉన్నాయి.అయితే వైద్య నిపుణుల సూచనతో కీళ్ళు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు సీతాకాలంలో అనారోగ్యాల ముప్పు నుండి తప్పించుకోవచ్చని ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఎముకల బలోపేతానికి రోజు కనీసం అరగంట పాటు వ్యాయామం తప్పక చేయాల్సిందే.

What Should Be Done To Keep Bones And Joints Healthy In Winter , Health , Healt

ముఖ్యంగా నడక, రన్నింగ్, జాగింగ్,( Running jogging ) డాన్సింగ్, మెట్లు ఎక్కడం లాంటి ఆక్టివిటీస్ చేయాలి.ఇక బరువులు మోసే వర్కౌట్స్ తో సమస్యలు ఎదుర్కొనేవారు స్విమ్మింగ్ చేసిన మెరుగైన ఫలితాలు పొందవచ్చు.యోగా, పైలెట్స్, డాన్స్ లాంటి ఆక్టివిటీస్ కూడా చేయవచ్చు.

Advertisement
What Should Be Done To Keep Bones And Joints Healthy In Winter , Health , Healt

వర్కౌట్ నెమ్మదిగా ప్రారంభించి మెల్లిగా వ్యాయామాలు( Exercises ) చేసే వ్యవధిని, తీవ్రతను పెంచుకుంటూ పోవాలి.ఇక ఎముకల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ డి, క్యాల్షియం తగినంత ఉండేలా చూసుకోవాలి.

అలాగే క్యాల్షియం అధికంగా ఉండే డైరీ ఉత్పత్తులను, కాయగూరలు, ఆకుకూరలు, క్యాల్షియం పోర్టిఫైడ్ ( Calcium fortified )ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

What Should Be Done To Keep Bones And Joints Healthy In Winter , Health , Healt

ఇక మరి ముఖ్యంగా విటమిన్ కె, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పండ్లు, కూరగాయలు, నట్స్ తరచుగా తీసుకోవాలి.అధిక బరువు, కీళ్ళు, ఎముకలపై ఒత్తిడి పెంచే క్రమంలో బరువు తగ్గేందుకు కూడా ప్రయత్నించాలి.అంతేకాకుండా శారీరకంగా చురుకుగా ఉండడంతో పాటు, ఎముకలు కీళ్ల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ బి12, విటమిన్ లోపం ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన సప్లిమెంట్లను తీసుకోవాలి.

అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా చూసుకోవాలి.అప్పుడే ఈ చలికాలంలో ఇన్ఫెక్షన్లతో దూరంగా ఉండవచ్చు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు