అనుదీప్ డైరెక్షన్ లో రవితేజ ఎలాంటి సినిమా చేస్తున్నాడు అంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ( Ravi Teja ) కి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.

ఇక సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చిరంజీవి బాటలో నడుస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటు స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఇంకా ఎప్పుడో రవితేజ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేయడమే కాకుండా తెలుగులో మంచి ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇంతకు ముందు ఆయన చేసిన మూడు సినిమాలు భారీ డిజాస్టార్లుగా మారాయి.ఇక అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల తను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ( Mr.Bachchan )సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటూనే ఈ సినిమాని సక్సెస్ చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్లు గా తెలుస్తుంది.ఇక దాంతో పాటుగా అణుదీప్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

Advertisement

ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తూ విక్రమార్కుడు సినిమా( Vikramarkudu )రేంజ్ లో మనల్ని నవ్వించబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.ఇక అనుదీప్ అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.కాబట్టి ఆయన డైరెక్షన్ లో రవితేజ హీరోగా సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

మరి వాటిని అందుకోవడానికి వీళ్ళు ఎలాంటి కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చి మనల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక ఈ సినిమాలో రవితేజ పోలీసు దొంగ రెండు క్యారెక్టర్ల లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.

2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?
Advertisement

తాజా వార్తలు