ఏసీ పెట్టడానికి అదేమన్న అత్తగారి ఇల్లా..?: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.

జైలులో చంద్రబాబుకు ముప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ఐదు కేజీలు తగ్గలేదన్న సజ్జల ఒక కేజీ బరువు పెరిగారని తెలిపారు.జైలులో ఏసీ పెట్టడానికి అదేమన్న అత్తగారి ఇల్లా అని ప్రశ్నించారు.

తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని కోర్టు ధృవీకరించిందన్న సజ్జల చంద్రబాబు కుటుంబం కావాలనే దబాయిస్తోందని పేర్కొన్నారు.ఉక్కపోతతో మిగతా ఖైదీలకు ఇబ్బంది ఉండదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు కోసం 24 గంటల పాటు వైద్యులను ఉంచారన్నారు.చంద్రబాబు స్నానం కోసం ప్రత్యేకంగా ట్యాంకేమైనా కట్టియాలేమోనని ఎద్దేవా చేశారు.

Advertisement

ఎలాగైనా చంద్రబాబును బయటకు తీసుకు రావాలనే ఆలోచనతోనే డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!
Advertisement

తాజా వార్తలు