ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే ఏంటో తెలుసా?

మన పూర్వికులు సూర్య భగవానుని గమనం ప్రకారం యుగాలు గానూ, యుగాలను సంవత్సరములు గానూ, సంవత్సరములను మాసములు గానూ, మాసములను వారములు గానూ, వారములను రోజులు గానూ, రోజులను జాములు గానూ, జాములను ఘడియలు గానూ కాల గమనాన్ని తెలుసుకోవటానికి విభజించారు.

సంవత్సరంలో ఉన్న 12 మాసములను రెండు ఆయనాలుగా విభజించారు.

సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ఏర్పడతాయి.ఒక్కో అయనం ఆరు నెలల పాటు ఉంటుంది.

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం ప్రతి జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు.దక్షిణాయనంలో దేవతలు నిద్రిస్తారు .ఆ సమయంలోనే ఎక్కువ పండుగలు వస్తాయి.ఆ సమయంలో మనం చేసే పూజల కారణంగా దేవతలకు శక్తి లభిస్తుంది.

ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు.ఈ సమయం చాలా మంచిది.

Advertisement

ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.ఈ ఉత్తరాయణంలో దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వివాహాలు చేయటానికి కూడా మంచి సమయం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్24, మంగళవారం 2024
Advertisement

తాజా వార్తలు