వెయ్యి కిలమీటర్లు దాటిన జగన్ బస్సు యాత్ర .. స్పందనేంటి ? 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )వచ్చే నెలలో జరగబోతున్న ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.

జనాల్లోనూ , పార్టీ కార్యకర్తలలోను ఉత్సాహం పెంచే విధంగా వారిని పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి తీసుకువెళ్లే విధంగా రకరకాల యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి సక్సెస్ అయిన జగన్, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు గత పది రోజులుగా సిద్ధం బస్సు యాత్ర ద్వారా జనాలకు దగ్గరయ్యే విధంగా జగన్ ముందుకు వెళుతున్నారు.ప్రకాశం జిల్లా మీదుగా రాయలసీమ అంతటా దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ను  కొనసాగించారు.

మరో పదహారు జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగాల్సి ఉంది.రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుగానే వైసీపీ ( YCP ) విజయావకాశాలు పెంచేందుకు జగన్ ఈ తరహా యాత్రలకు శ్రీకారం చుట్టారు .జగన్ చేపట్టిన ఈ యాత్రలకు జనాల నుంచి భారీగా స్పందన వస్తూ ఉండడంతో,  వైసీపీలో మంచి జోష్ కనిపిస్తోంది, అలాగే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరుతుండడం ఆ పార్టీలో మరింత జోష్ నింపుతోంది.

జగన్ యాత్రలోనే అనేక మంది పార్టీలో చేరారు కొండేపి,  కనిగిరి, కందుకూరు నియోజకవర్గలకు చెందిన వైసిపి కార్యకర్తలతోనూ జగన్ సమావేశం అయ్యారు.10వ రోజు ప్రకాశం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జగన్ పర్యటించిన అనంతరం వెంకట చలంపల్లిలో రాత్రి బస చేశారు.తన 11 రోజు ప్రజా సంకల్ప యాత్ర ను ఈరోజు ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి నుంచి జగన్ ప్రారంభించారు.

Advertisement

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండ లో రోడ్ షో నిర్వహించి,  గంటావారి పాలెం( Gantavari Palem ) లో బస చేసే ముందు బోడంపాడు , కురిచేడు,  చీకటిగల పల్లి వంటి ప్రాంతాల్లో పర్యటిస్తారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసీల రఘురాం తెలిపారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో చేరికల పరంపర కొనసాగుతోంది.

నిన్ననే ఏలూరు జిల్లా దెందులూరు లో భారీగా టిడిపి, కాంగ్రెస్ ,బిజెపిలకు చెందిన అనేక మది నేతలు వైసిపిలో చేరారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ ,గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్ గౌడ్, టిడి క్లస్టర్ ఇన్చార్జి భాను ప్రకాష్( Chalumolu Ashok Goud, TD Cluster Incharge Bhanu Prakash ) , సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నాయకుడు ఎం వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ నుంచి ఏపిసిసి ప్రధాన కార్యదర్శి డివిఆర్ కె చౌదరి , డిసిసి కార్యదర్శి సిహెచ్ కిరణ్, బిజెపి పెదవేగి మండల అధ్యక్షుడు పొన్నూరు శంకర్ గౌడ్ వైసీపీలో చేరారు.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు