Ramya Krishna Krishna Vamshi : రమ్య కృష్ణ, కృష్ణవంశీ దూరం గా ఉండటానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అనే చాలా తక్కువ కాలం పాటు ఉంటుంది.ఒక సక్సెస్ వస్తే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంటారు.

సక్సెస్ రాకపోతే మాత్రం వాళ్లని ఇండస్ట్రీలో పట్టించుకునే వాళ్లే ఉండరు.అందువల్లే ఇండస్ట్రీ లో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం ఉంటుంది.

కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం దాదాపు పది పదిహేను నుంచి 20 సంవత్సరాల వరకు ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ఉన్నారు.

అలాంటి వాళ్లలో రమ్యకృష్ణ( Ramya Krishna ) ఒకరు.ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది.ఇక హీరోయిన్ గా దాదాపు 15 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన రమ్యకృష్ణ.

Advertisement

ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తూ బెస్ట్ పర్ఫా మెన్స్ ఇస్తు వస్తుంది.ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమాలో( Baahubali ) ఆమె చేసిన శివగామి పాత్రతో( Shivagami Role ) ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక దాంతో అన్ని లాంగ్వేజ్ ల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది.ఇక ఇదిలా ఉంటే రమ్యకృష్ణ హీరోయిన్ గా ఉన్నప్పుడే కృష్ణవంశీని( Krishna Vamshi ) పెళ్లి చేసుకుంది.

అయితే వీళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.

ఇక ఇది ఇక ఉంటే ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ఉంటున్నారా లేదా విడివిడిగా ఉంటున్నారా అనే విషయాల మీద చాలా ఆసక్తికరమైన వార్తలైతే వస్తున్నాయి.ప్రస్తుతం కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటే రమ్యకృష్ణ చెన్నైలో ఒంటరిగా ఉంటుందంటూ వార్తలైతే వస్తున్నాయి.మరి ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేదంటే కెరియర్ పరంగానే వీళ్లిద్దరు దూరంగా ఉంటున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ చాలా మంచి పాత్రలు చేస్తూ ముందుకు కదులుతుంది.

Advertisement

తాజా వార్తలు