మోదీ సభకు చంద్రబాబు దూరం.. కారణం ఏంటంటే ..? 

బీజేపీ అగ్ర నేత ప్రధాని నరేంద్ర మోదీ ( Prime Minister Narendra Modi )ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

కూటమి అభ్యర్థులకు మద్దతుగా రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు.

దీనిలో భాగంగా ఈరోజు రాజమండ్రి ,అనకాపల్లి సభలో ప్రధాని పాల్గొంటారు.ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అయితే ప్రధాని మోదీ రాజమండ్రి సభకు టిడిపి అధినేత చంద్రబాబు దూరంగా ఉండబోతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభలో పాల్గొంటారు.8 వ తేదీన పీలేరు అసెంబ్లీ పరిధిలో జరిగే సభలో పాల్గొంటారు.అదేరోజు సాయంత్రం విజయవాడలో రోడ్డు షోలో పాల్గొంటారు.

ఈ షెడ్యూల్ లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి( Rajahmundry ) కి రానున్నారు.అక్కడ నుంచి వేమగిరి సభ ప్రాంగణానికి చేరుకుంటారు.

What Is The Reason For Chandrababus Distance From Modis House, Prime Minister
Advertisement
What Is The Reason For Chandrababu's Distance From Modi's House, Prime Minister

అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు .రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థి గా పోటీ చేస్తున్న పురందరేశ్వరితో( Purandareshwari ) పాటు, కూటమికి చెందిన ఇతర అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రధాని మోదీ బహిరంగ సభలో జనాలకు పిలుపునివ్వనున్నారు అయితే ప్రధాని పాల్గొనే ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు దూరంగా ఉండడం ఆసక్తికరంగా మారింది.అయితే రాజమండ్రి ప్రధాని సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొంటారు.

అయితే చంద్రబాబు ఈ సభకు హాజరు కాకపోవడానికి కారణాలు ఉన్నాయి.

What Is The Reason For Chandrababus Distance From Modis House, Prime Minister

ప్రధాని మోదీ ఆకాశమార్గం లో ప్రయాణించే సమయంలో మరో విమానంలో వెళ్లేందుకు ఆంక్షలు ఉండడంతో, చంద్రబాబు రాజమహేంద్రవరం సభలో పాల్గొనేందుకు వీలుపడదు.దీంతో అనకాపల్లి సభకు మాత్రమే చంద్రబాబు హాజరవుతారు.రాజమండ్రి సభలో బిజెపి నుంచి పోటీ చేస్తున్న ఐదుగురు లోక్ సభ అభ్యర్థులు పాల్గొంటారు.

ఈ సభ అనంతరం ప్రధాని మోదీ అనకాపల్లి సభకు వెళ్లి అక్కడ బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ , ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు