శ్రీరామ నవమి పండుగను ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?

మన హిందూ పురాణాల ప్రకారం శ్రీరామ చంద్రుడు వసంత ఋతువులో చైత్ర శుద్ద నవమి.

గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గామధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు.

అయితే త్రేతాయుగంలో అభిజీత్ ముహూర్తంలో జన్మించిన ఆ మహనీయుడి జన్మదినాన్ని మనం పండుగల చేసుకుంటాం.అయితే చైత్ర శుద్ధ నవమి నాడే సీతా రాముల కల్యాణం జరిగిందని కూడా చెబుతుంటారు.

అంతే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు అరణ్య వాసం తర్వాత.ఇదే ముహూర్తంలో సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడట.

వీటన్నిటిని పురస్కరించుకొని మనం శ్రీరామ నవమి పండుగను నిర్వహించుకుంటాం.ఇదే రోజున సీతారాముల వివాహం జరిగింది కాబట్టి ప్రతీ ఏటా ఇదే రోజున వీరి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు.

Advertisement
What Is The Reason Behind We Celebrated Sri Rama Navami Details, Chaitra Suddha

అలాగే స్వామి వారికి ఇష్టమైన వడపప్పు, పానకం ప్రసాదాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి పండుగకు ఎంతో విశిష్టత ఉంది.

మహారాష్ట్రలో చైత్ర నవ రాత్రిగా, ఏపీలో వసంతోత్సవంగా తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలను జరిపిస్తుంటారు.

What Is The Reason Behind We Celebrated Sri Rama Navami Details, Chaitra Suddha

ఇందులో భాగంగానే చాలా మంది ఇళ్లల్లోల లేదా ఆలయాల్లో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు.ఉత్సవ మూర్తులను ఊరేగిస్తూ.రంగు నీళ్లు చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు.

సీతారాముల కల్యాణం చూడటాన్ని గానీ చేయడాన్ని గానీ ఎన్నో జన్మల ఫలంగా భావిస్తుంటారు.శ్రీరామ నవమి రోజంతా ఉపవాసం ఉండి స్వామి వారి కృప కోసం భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.

చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!
Advertisement

తాజా వార్తలు