అసలు ఆకాశదీపం అంటే ఏంటి.. దీన్ని ఎందుకు వెలిగిస్తారంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే శివ కేశవులకు కార్తిక మాసం( Karthika masam ) అంటే ఎంతో ఇష్టం అని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో ఆలయాలలో ధ్వజస్తంభానికి ఆకాశదీపం( Akashadeepam ) వేలాడదిస్తూ ఉంటారు.

చిన్నచిన్న రంధ్రాలు చేయబడిన ఒక గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుందని పురాణాలు చెబుతున్నాయి.

తాడు సహాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై భాగాన వేలాడదీస్తారు.అయితే దీనిని ఆకాశదీపం అని పిలవడానికి, అలాగే ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉందని పండితులు చెబుతున్నారు.

What Is The Real Sky Lamp.. Why Is It Lit , Karthika Masam , Scholars, Akashad

అలాగే ఆకాశం మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తిక పురాణం చెబుతోంది.కార్తీకమాసంలో పితృ దేవాతలంత ఆకాశమార్గన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు.ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం దేవాలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు.

Advertisement
What Is The Real Sky Lamp.. Why Is It Lit , Karthika Masam , Scholars, Akashad

ఆకాశదీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది.ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివ కేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు వెలుతురు ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

దీన్ని వెలిగిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి."దామోదర మావాహయామి" "త్రయంబక మావాహయామి" అని శివ కేశవులను ఆహ్వానిస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తారు.

What Is The Real Sky Lamp.. Why Is It Lit , Karthika Masam , Scholars, Akashad

ఒక్కోచోట రెండు దీపాలు శివ కేశవుల( Shiva Kesavula ) పేరుతో వెలిగిస్తారు.తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగును అందిస్తుందని చెబుతున్నారు.అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లో తొలగిపోతాయి.

కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలన అవుతుందని చెబుతున్నారు.అలాగే కార్తిక మాసం ప్రారంభం కూడా ఆకాశదీపం తోనే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

ఆకాశదీపం వెలిగించిన ధూపంలో నూనె పోసిన, ఈ దీపాన్ని దర్శించుకోని నమస్కరించుకున్న పుణ్య ప్రాప్తి లభిస్తుందని కూడా చెబుతున్నారు.మనలోని అజ్ఞాన, అవివేకాలు తొలగిపోతాయని కూడా చెబుతున్నారు.

Advertisement

అంతే కాకుండా పితృదేవతలు( Pitru Devathalanu ) కూడ సంతోషపడతారని పండితులు చెబుతున్నారుఆలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చని కూడా చెబుతున్నారు.దీపానికి పూజ చేసి దీపా ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవలను స్మరిస్తూ నమస్కరిస్తూ దీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయాలని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు