ఆర్‌ఆర్‌ఆర్‌ః నేడో రేపో అన్నట్లుగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్‌ అభిమానులు

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ వచ్చే నెలతో పూర్తి కాబోతుంది.

సినిమా ను అక్టోబర్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి నుండి రామ్‌ చరణ్‌ బర్త్‌ డే కానుకగా ఏం రాబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గత ఏడాది కరోనా కారణంగా షూటింగ్‌ నిలిపి వేసి ఉన్నా కూడా చరణ్‌ బర్త్‌ డే కోసం ఎన్టీఆర్‌ తో వాయిస్‌ ఓవర్‌ చెప్పించి మరీ మేకింగ్‌ ఆఫ్‌ అల్లూరి సీతారామ రాజు ను విడుదల చేయడం జరిగింది.

What Is The Ram Charan Birthday Special Fro Rrr Team , NTR ,Rajamouli ,Ram Chara

ఇక ఈ ఏడాది రాబోతున్న చరణ్‌ బర్త్‌ డే కు రాజమౌళి టీమ్ నుండి రాబోతున్న స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌ ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో జక్కన్న టీమ్‌ నుండి ఏ సమయంలో అయినా ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మార్చి 27వ తారీకున రామ్ చరణ్ పుట్టిన రోజు ను పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు నెల రోజుల ముందు నుండే అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అభిమానులు ఆర్‌ఆర్‌ఆర్‌ అప్ డేట్‌ కోసం కూడా ఎదురు చూస్తున్నారు.

Advertisement

చరణ్‌ బర్త్‌ డే మరో అయిదు రోజుల్లో రాబోతుంది.కనుక నేడో రేపో ఏ సమయంలో అయినా ఆర్‌ ఆర్‌ ఆర్‌ అప్‌ డేట్‌ కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

చరణ్‌ బర్త్‌ డే కోసం ఖచ్చితంగా అభిమానులకు సర్‌ ప్రైజ్‌ ను జక్కన్న రెడీ చేసి ఉంటాడు.అందుకే ఈ సినిమా మేకింగ్ వీడియో కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

చరణ్‌ కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.కనుక ఇద్దరి కాంబోలో ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?
Advertisement

తాజా వార్తలు