కోదండరాం యాక్షన్ ప్లానేంటి? ఆప్‌లో విలీనమేనా..?

ఒకప్పుడు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.తెలంగాణ ఉద్యమంలో వారిద్దరీ ఒకటే మాట.

ఒకటే బాట.

కానీ తరవాత వాళ్ళిద్దరూ విడిపోయారు.ఆశించిన తెలంగాణ రాలేదని ఆచార్య కోదండరాం బయటకు వచ్చారు.

కోదండరాం బాటే ఇప్పుడు వేరయింది.తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టారు.

అయితే ఇటీవలి కాలంలో తెలంగాణ జనసమితిని వేరే పార్టీలో విలీనం చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అప్పుడు అందరినీ కలిసేలా చేశారు.

Advertisement
What Is The Kodandaram Action Plan Merged In AAP , Kodandaram , AAP , Ts Poltic

ఇప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా అన్ని శక్తుల్ని ఏకం చేసే పనిలో పడ్డారు.అసలు కోదండరాం యాక్షన్ ప్లానేంటి? దేశరాజకీయాల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్‌గా కీలక పాత్ర వహించి.

అనంతరం కేసీఆర్‌తో విభేదాల కారణంగా బయటికొచ్చి సొంత కుంపట్టి పెట్టుకున్న ప్రొఫెసర్ కోదండరాం తన టీజేఎస్ పార్టీని ఆప్‌లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం చర్చనీయాంశమైంది.అదే విషయంపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు.

ఆప్‌లో పార్టీని విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.ఆప్‌లో టీజేఎస్‌ను విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు.

What Is The Kodandaram Action Plan Merged In Aap , Kodandaram , Aap , Ts Poltic

అయితే భావసారూప్యత ఉన్న పార్టీలో కలిసి నడుస్తామని ఆయన ప్రకటించారు.జనసేనాని పవన్ కళ్యాణ్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వారితో కలిసి పనిచేసే అంశంపై ఆయన స్పందించారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన వ్యక్తి కాదని కోదండరాం అన్నారు.వైఎస్ షర్మిల తెలంగాణను వ్యతిరేకించారని ఆమెతో కలిసి నడిచే అవకాశం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం.

Advertisement

గతంలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌లో పార్టీ విలీనం చేస్తారని జరుగుతున్న ప్రచారం కూడా వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు.క్లీన్ ఇమేజ్‌తో పంజాబ్‌లో సత్తాచాటి అధికార పీఠం కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది.

దక్షిణాదిలోనూ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది.అందుకు తగ్గట్టుగా తెలంగాణలో పాదయాత్ర కూడా ప్లాన్ చేసింది.

అంతవరకూ బాగానే ఉన్నా తెలంగాణకు చెందిన ఓ పార్టీ ఆప్‌లో విలీనం కాబోతుందంటూ జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు