ప్రసాదం అంటే ఏమిటి? దాన్ని విక్రయించడం సరైన పద్దతేనా?

ప్రసాదం అంటే సాధారణంగా ఏదైనా తినగల ఆహారాన్ని సూచిస్తుంది.ఇది ప్రముఖంగా శాకాహారమై ఉంటుంది.

మతం ఏదైనా సమర్పించే విధానం, ఆచరణ ప్రసాదానికి ఒకేలా ఉంటుంది.దీనిని మొదట దేవుళ్లకు, ఆరాధ్య స్వాములకు సమర్పించిన తర్వాత భక్తులకు పంచి పెడతారు.

దేవుళ్లకు సమర్పించడానికి ముందు సాధారణ వంటకంగా.భగవాన్ కు సమర్పించిన తర్వాత పుణ్య పదార్థంగా.

ప్రసాదంగా, నైవేద్యంగా పిలువబడుతుంది.అయితే చాలా మంది ముందు దేవుడికి సమర్పించిన తర్వాత వేరే వాళ్లకు పంచిపెడుతుంటారు.

Advertisement

గుడుల్లో అయితే ప్రసాదం అమ్మకాలు కూడా చేపడుతుంటారు.అయితే ప్రసాదం అమ్మడం సరైన పద్దతేనా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రసాదం భౌతిక కోణంలో భక్తునికి, దేవునికి మధ్య ఇవ్వడం, స్వీకరించడం అనే  ప్రక్రియ జరుగుతుంది.తద్వారా ప్రసాదం అనే పదం వచ్చింది.

మొదట దేవునికి, ఆరాధ్య స్వాములకు, ఇష్ట గురువులకు సమర్పించిన తర్వాత భక్తులకు ఇచ్చేదే ప్రసాదం. సాధారణ పరిస్థితుల్లో ప్రసాద విక్రయాలు మంచివి కావని శాస్త్రాలు చెబుతాయి.

ఎందుకంటే ప్రసాదం అంటేనే దేవునికి సమర్పించి ఆహారాన్ని భక్తులకు పంచడం.కానీ అసాధారణ పరిస్థితుల్లో ధర్మాధర్మాలు పలు మార్పులకు లోనుకాక తప్పని పరిస్థితి తలెత్తుంది.

పరగడుపున ఈ పండును తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు..!

వేలు, లక్షల సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు వారికి ప్రసాదం కావాలని అడగడంతో పాటు బంధుమిత్రులకు పంచడానికి ఎక్కువ పరిమాణంలో కావాలని కోరిన సందర్భాల్లో లక్షలు కోట్లు వెచ్చించి ప్రసాదాన్ని తయారు చేసి ఉచితంగా పంచడం సాధ్యమయ్యే పని కాదు.అలాంటి పరిస్థితుల్లో ప్రసాదాన్ని కొంత మొత్తం తీసుకుని విక్రయించడంలో ఎలాంటి ధర్మ నిబంధనల ఉల్లంఘనల జరగదనే భావించాల్సి ఉంటంది.

Advertisement

తాజా వార్తలు