జగన్ దృష్టంతా పవన్ పైనే.. ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల సమరశంఖాన్ని ఇప్పటికే పూరించడంతో ఎలక్షన్స్ కు చాలా టైమ్ ఉన్నప్పటికి ఏపీ పాలిటిక్స్ వేడెక్కాయి.

విమర్శలు, ప్రతివిమర్శలు, వాదోపవాదాలు, ఆరోపణలు, నిందలు.ఇలా అన్నిట్లోనూ మూడు ప్రధాన పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

సాధారణంగా అధికార ప్రతిపక్ష పార్టీల మద్య విమర్శలు ప్రతివిమర్శలు రావడం చూస్తూ ఉంటాము.కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్న వాతావరణం కనిపిస్తోంది.

What Is Jagans Target Pawan, Pawan Kalyan , Ys Jagan, Ap Politics, Jana Sena,

అధికార వైసీపీ( YCP ) ప్రతిపక్ష టీడీపీని కాదని జనసేన పార్టీపై ఫోకస్ పెట్టింది. జనసేన పార్టీకి సంబంధించి ఒక్క స్థానం కూడా లేకపోయినప్పటికి జేఎస్పీ ని ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మద్య వైసీపీ నేతలు చంద్రబాబుపై కంటే పవన్ పైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు.

Advertisement
What Is Jagan's Target Pawan, Pawan Kalyan , Ys Jagan, Ap Politics, Jana Sena,

పవన్ తన ప్రసంగాల్లోనూ లేదా రోడ్ షో, పర్యటనల్లో జగన్ పాలనపై లేదా వైసీపీ నేతలపై ఎలాంటి విమర్శలు చేసిన.దానికి కౌంటర్ గా వైసీపీ నేత్లౌ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి స్పందిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు జగన్ పాలనపై ఎలాంటి విమర్శలు చేసిన కనీసం స్పందించేందుకు కూడా వైసీపీ నేతలు మొగ్గు చూపడంలేదు.

What Is Jagans Target Pawan, Pawan Kalyan , Ys Jagan, Ap Politics, Jana Sena,

దీన్ని బట్టి చూస్తే టీడీపీ( Tdp ) కంటే జనసేనతోనే తమకు ముప్పు అని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు క్లియర్ గా అర్థమౌతోంది.ఇటీవల జరిగిన బహిరంగ సభలో ఏకంగా సి‌ఎం జగన్ కూడా పవన్( Pawan kalyan ) మూడు పెళ్లిళ్ల విషయంలోనూ, దత్తపుత్రుడంటూ, ప్యాకేజీ స్టార్ అంటూ రకరకాల విమర్శలు చేశారు.కానీ చంద్రబాబుపై మాత్రం విమర్శల ఘాటు తగ్గించారు.

ఇలా పరినమలన్నీ చూస్తే జగన్( CM jagan ) కు ప్రధాన ప్రత్యర్థి పవనేనా అనే డౌట్ రాకమానదు.కాగా గతంతో పోల్చితే రాష్ట్రంలో ప్రస్తుతం జనసేన వేగంగా బలం పెంచుకుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈసారి ఎన్నికల్లో జనసేన ప్రభావం గట్టిగానే ఉండబోతుందని ఆయా సర్వేలు కూడా వెల్లడించాయి.అందుకే టీడీపీ కంటే జనసేన పార్టీని నిలువరించడమే టార్గెట్ గా పెట్టుకుంది వైసీపీ.

Advertisement

మరి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం వైసీపీపై ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు