నిర్లక్ష్యం చేస్తే.. తెలంగాణ కూడా చేజారినట్లే !

మంచి దూకుడు మీద ఉన్న బీజేపీకి( BJP ) కర్నాటక ఎన్నికలు సడన్ బ్రేకులు వేశాయి.

ఈ ఎన్నికల్లో విజయంపై మొదటి నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి ఊహించని రీతిలో కన్నడ ఓటర్లు కాషాయ పార్టీకి షాక్ ఇచ్చారు.

దీంతో ఎక్కడ పొరపాటు జరిగింది ? విజయం ఎందుకు దూరమైంది ? అనే అంశాలపై ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు.కర్నాటకలో జరిగిన పొరపాట్లు ఇతర రాష్ట్రాలలో జరగకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

కర్నాటక ఎన్నికల తరువాత సమీపంగా తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి.తెలంగాణలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాషాయ పార్టీ గట్టిపట్టుదలగా ఉంది.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ వేగంగా బలపడుతూ వచ్చింది.

Advertisement

రాష్ట్రంలో బలమైన బి‌ఆర్‌ఎస్( BRS party ) పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ వడివడిగా అడుగులేస్తుంది.ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీ పార్టీనే ఆల్టర్నేట్ గా భావిస్తున్నారు.దీంతో ఇదే ఊపులోనే అధికారం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఆశలు ఏమాత్రం హద్దు దాటిన కర్నాటక ఫలితలే తెలంగాణలో కూడా రిపీట్ అవుతాయనే భయం ఇప్పుడు కమలనాథులను వేదిస్తోంది.అందుకే దూకుడు తగ్గించి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది బీజేపీ అధిష్టానం.

గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలం ఏ స్థాయిలో ఉంది ? బి‌ఆర్‌ఎస్ ను ఎదుర్కోవడానికి ఉన్న మార్గలేంటి ? పార్టీ నేతల్లో ఏమైనా అసమానతలు ఉన్నాయా ? వంటి వాటిపై అధిష్టానం ఫోకస్ పెట్టిందట.

ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్( Etela Rajender ) కు డిల్లీ పెద్దల నుంచి తాజాగా పిలుపు వచ్చింది.ఉన్నపళంగా డిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో అధిష్టానం ఎలాంటి సూచనలు చేయబోతుందనే చర్చ రాష్ట్ర నేతల్లో నెలకొందట.ఇదిలా ఉంచితే ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కాషాయ పార్టీ.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఇకపై మరింత ఎక్కువ సమయం ప్రజల మద్యనే గడిపేందుకు సిద్దమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈటెల డిల్లీ పర్యటన అనంతరం డిల్లీ పెద్దల సూచనల మేరకు తదుపరి చేపట్టవలసిన కార్యక్రమాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

మరి బీజేపీకి కర్నాటకలో చేజారిన అధికారం తెలంగాణలోనైనా దక్కుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు