Mahesh Babu : మహేశ్ బాబుతో తీయాలని అనుకున్నారు.. తరుణ్ తో తీశారు.. ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు కొందరు హీరోలను దృష్టిలో ఉంచుకొని కథలు రాస్తూ ఉంటారు.

కొన్నిసార్లు స్టోరీ సిద్ధం చేసుకుని నిర్మాతలను సంప్రదించగా ఇది ఫలానా నటుడికి సెట్‌ అవుతుందని వాళ్లు సలహాలు ఇస్తుంటారు.

అలా దర్శకుడు కాశీ విశ్వనాథ్‌( Kashi Vishwanath ) రాసిన ప్రేమకథకు మహేశ్‌ బాబు( Mahesh Babu ) బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేశ్‌ దగ్గుబాటి సూచించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.తన కథలో హీరోగా తరుణ్‌ ను ఎంపిక చేసుకున్నారుట.

అయితే ఆ సినిమా మరేదో కాదు నువ్వు లేక నేను లేను( nuvvu leka nenu lenu ).

మహేశ్‌తో సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉంటారు.ఆయన డేట్స్‌ దొరకడం కష్టం.ఇప్ప‌టికే నాకు లేట్ అయింది.

Advertisement

ఈ క‌థ‌కి త‌రుణ్ ( Tarun ) స‌రిగ్గా స‌రిపోతాడు.పైగా నువ్వే కావాలి చిత్రంతో హిట్ అందుకున్నాడు అని సురేశ్ బాబుకి చెప్పిన‌ట్టు విశ్వనాథ్‌ ఒక ఇంట‌ర్వ్యూలో నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.

అలా 2002 జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది.తరుణ్‌- హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌( Arti Agarwal ) జోడీ విశేషంగా ఆకట్టుకుంది.

ఆర్పీ పట్నాయక్‌ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.కాగా ఇప్పటికీ ఈ సినిమా విడుదల అయితే టీవీలకు అతుక్కుపోయి చూసేవారు చాలామంది ఉన్నారు.

ఇకపోతే హీరో తరుణ్ విషయానికి వస్తే ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.పూర్తి స్థాయిలో బిజినెస్ పై ఫోకస్ పెట్టిన తరుణ్ బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు