తెలంగాణలో ఏం మార్పు వచ్చింది..: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్నలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి తన అవినీతి పాలనను చూపిస్తున్నారని మండిపడ్డారు.

అయితే రాష్ట్రంలో మార్పు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారన్న కిషన్ రెడ్డి ఏం మార్పు వచ్చిందో చెప్పాలన్నారు.తెలంగాణలో కేసీఆర్( KCR ) కుటుంబ పాలన పోయి సోనియాగాంధీ( Sonia Gandhi ) కుటుంబ పాలన వచ్చిందన్నారు.

ఇదేనా రాష్ట్రంలో వచ్చిన మార్పు అంటూ విమర్శించారు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పటివరకు చేయలేదని మండిపడ్డారు.

ఐదు గ్యారెంటీలను అమలు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఎక్కడ చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Advertisement
తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?

తాజా వార్తలు