థైరాయిడ్ ఉన్న‌వారు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాల‌ట‌..ఎందుకంటే?

థైరాయిడ్‌ గ్రంధి థైరాయిడ్‌ హార్మోన్ ను విడుద‌ల చేస్తంది.

ఈ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన బాడీ యొక్క పనులను నియంత్రించేందుకు సహాయపడుతుంది.

అయితే ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ ఉత్ప‌త్తిలో హెచ్చుత‌గ్గులు ఏర్ప‌డ‌తాయో అప్పుడు థైరాయిడ్ వ్యాధి వ‌స్తుంది.థైరాయిడ్ లోనే రెండు ర‌కాలు ఉన్నాయి.

అందులో ఒక‌టి హైపో థైరాయిడిజం.మ‌రొక‌టి హైపర్ థైరాయిడిజం.

తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడాన్ని హైపో థైరాయిడిజం, అవ‌స‌రం అయిన దానికంటే ఎక్కువ ఉత్ప‌త్తి కావ‌డాన్ని హైప‌ర్ థైరాయిడిజం అని అంటారు.అయితే ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పెట్టేది హైపో థైరాయిడిజం.

Advertisement

దీని వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, అల‌స‌ట‌, ఆయాసం, ప్రెగ్నెన్సీ రాక‌పోవ‌డం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, హెయిర్ ఫాల్ ఇలా వివిధ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.అందుకే థైరాయిడ్ బారిన ప‌డ్డ‌వారు త‌ప్ప‌కుండా ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.

ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని సమతుల్యం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.అయితే అందుకు యాపిల్ సైడ‌ల్ వెనిగ‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

థైరాయిడ్ వ్యాధితో బాధ‌ప‌డేవారు ప్ర‌తి రోజు ఉద‌యాన్నే గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో వ‌న్ టేబుల్ స్పూన్‌ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తీసుకోవాల‌ట‌.త‌ద్వారా థైరాయిడ్ గ్రంధి ప‌ని తీరు మెరుగుప‌డి.

హార్మోన్ ఉత్పత్తి బ్యాలెన్స్ అవుతుంది.అదే స‌మ‌యంలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ శ‌రీరంలోని విషాల‌ను, వ్య‌ర్థాల‌ను తొల‌గించి.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

జీవక్రియను పెంచుతుంది.త‌ద్వారా వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

అలాగే థైరాయిడ్ ఉన్న వారు షుగ‌ర్‌, షుగ‌ర్‌తో త‌యారు చేసే ఫుడ్స్‌కు వీలైనంత వ‌ర‌కు దూరంగా ఉండాలి.విట‌మిన్ డి పుష్క‌లంగా ఉండే గుడ్డు, చేప‌లు, పుట్ట‌గొడుగులు, సోయా పాలు, ఓట్స్ వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి.ప్ర‌తి రోజు కనీసం ఇర‌వై నిమిషాలు అయినా వ్యాయామాలు చేయాలి.

మ‌రియు బాడీని ఎప్ప‌టిక‌ప్పుడు డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి.త‌ద్వారా థైరాయిడ్ స‌మ‌స్య అదుపులో ఉంటుంది.

పైన చెప్పుకున్న స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు