దంతాలనే కాదు .. నాలుకని శుభ్రపరుచుకోవాలి లేదంటే

దంతాలని రోజు శుభ్రం చేసుకుంటాం.

ఎందుకంటే వాటికి ఎక్కడ పాచి పడుతుందో, నవ్వుతున్నప్పుడు దంతాలు పసుపు పచ్చలో ఎక్కడ కనబడతాయో, బలహీనపడి ఎక్కడ విరిగిపోతాయో అని భయం.

మరి నాలుక ? నాలుకను శుభ్రపరుచుకుంటున్నారా ? అసలు మీ దగ్గర టూత్ బ్రష్ తో పాటు టంగ్ క్లీనర్ ఉందా ? ఎప్పుడైనా వాడారా ? నోరు శుభ్రంగా ఉండాలి అని అనుకునేవారు .నాలుక పట్ల మాత్రం ఎందుకు అంత అజాగ్రత్తగా ప్రవర్తిస్తారో అర్థం కాదు.దంతాలతో పాటు నాలుకని కూడా రోజు శుభ్రం చేసుకోవాలి .లేదంటే .* శరీరం లోంచి టాక్సిన్స్ బయటకి పోవాలని ఇప్పటికి చాలాసార్లు చదువుకున్నాం.నాలుకను శుభ్రం చేసుకోనంతవరకు ఎంత చేసినా వెస్ట్.

ఎందుకంటే నాలుకపై కూడా బ్యాక్టీరియా, మలినాలు ఉండిపోతాయి.ఇవి తిరిగి శరీరంలోకి వెళ్ళిపోతాయి.

మళ్ళీ పాత కథే.కాబట్టి శరీరం అంటే, మెడ కింది భాగమే కాదు, నాలుకని తప్పక శుభ్రం చేసుకోండి.* ఇంతకుముందు చెప్పినట్టుగా, నాలుకని శుభ్రం చేసుకోకపోతే బ్యాక్టీరియా అలానే ఉండిపోతుంది.

Advertisement

దీంతో టెస్ట్ బడ్స్ కి ఆహారం రుచి మరీ ఎక్కువగా తెలియదు.ఎందుకంటే వాటిని బ్యాక్టీరియా కప్పేసి ఉంటుంది కాబట్టి.

అందుకే నాలుకని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి.అప్పుడు మన నాలుకకి అందే రుచి వేరు.

ప్రతి ఆహారం యొక్క రుచిని అంతర్లీనంగా ఆస్వాదించవచ్చు.* నాలుక ఎప్పుడు ఉన్న చోటే ఉండదు కదా.అది దంతాలకి తగులుతూ ఉంటుంది.దాన్ని దంతాలకి అటు ఇటుగా తిప్పుతూ ఉంటారు.

అప్పుడు నాలుకపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, టాక్సిన్స్ మీ దంతాలపై కూడా దాడి చేస్తాయి.దాంతో దంత సంబంధిత సమస్యలు వస్తాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
బాల్య వివాహం నుంచి తప్పించుకుంది.. ఇంటర్ లో 978 మార్కులు.. కుసుమ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

* నోటి నుంచి దుర్వాసన వచ్చేది కేవలం దంతాలు శుభ్రంగా లేకపోవడం వలనే కాదు, నాలుక శుభ్రంగా లేకపోయినా దుర్వాసన వస్తుంది.అంతే కాదు, పోరపాటులో మీరు నోటి నుంచి గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి కూడా కలుషితం అయిపోయి, బ్యాడ్ బ్రీత్ సమస్య వస్తుంది.

Advertisement

కాబట్టి దంతాలతో పాటు నాలుకని కూడా శుభ్రం చేసుకోండి.* నాలుకపై కూడా పాచి లాంటి తెల్ల పదార్థం ఏర్పడి పోతుంది.

ఇదే మీ నోటిని ఇన్ఫెక్షన్స్ కి గురి చేస్తుంది.అలానే అజాగ్రత్తగా ఉంటే మీరు తీసుకునే మంచి ఆహారపదార్థాలలోకి కూడా టాక్సిన్స్ వెళ్ళిపోతాయి.

దాంతో మీ డైట్ కూడా పాడైపోతుంది.అందుకోసమైనా, రోజు అలసత్వం వదిలి, దంతాలను బ్రష్ చేసుకునేటప్పుడే, నాలుకని కూడా క్లీన్ చేసుకోండి.

తాజా వార్తలు